పునీత్ రాజ్ కుమార్, సిద్ధార్థ శుక్లా... వంటి తారలెందరో శారీరకంగా దృఢంగా ఉన్నవారే. అయినా గుండె పోటుతో మరణించారు. వీళ్లే కాదు ఎంతో మంది కనీసం యాభై ఏళ్లు దాటకుండానే గుండె పోటు బారిన పడుతున్నారు. గుండె పోటు, కార్డియాక్ అరెస్టు రెండూ వేరువేరు. గుండె పోటు వచ్చినవారికి సకాలంలో చికిత్స అందితే బతికే అవకాశాలు ఉంటాయి కానీ, కార్డియాక్ అరెస్టు వస్తే మాత్రం బతికే అవకాశాలు కేవలం 5శాతం మాత్రమే. అందుకే గుండె పోటుకు సంబంధించి అన్ని విషయాలను తెలుసుకోవడం చాలా అత్యవసరం. గుండెకు రక్తాన్నిసరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెకు ఆక్సిజన్ అందదు, రక్తం కూడా సరిపడినంత సరఫరా కాదు. ఆ సమయంలో గుండె పోటు వస్తుంది. ఇలాంటి గుండె సమస్య ఉన్నవారిలో కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. వాటిని ముందే పసిగడితే ప్రాణాలను కాపాడుకోవచ్చు.
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
గుండెలో సమస్య ఉన్నప్పుడు ఇలా లక్షణాలు కనిపిస్తాయి...
1. గుండె భాగంలో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఛాతీలో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి అలా భుజాలకు, దవడలకు, చేతులకు పాకుతుంది.
2. తరచూ ఊపిరి సరిగా ఆడనట్టు అనిపిస్తుంది. చాలా గట్టిగా ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది.
3. గుండె దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. అప్పుడప్పుడు మంటగా అనిపిస్తుంది. సూదులతో పొడినట్టు అనిపిస్తుంది.
4. గుండె పోటు రావడానికి కొంత సమయం ముందు నోరు తడారిపోతుంది. దాహం విపరీతంగా పెరిగిపోతుంది. ఒళ్లంతా తీవ్రంగా చెమటలు పట్టేస్తాయి. కొందరికి స్పృహ ఉండదు.
5. తరచూ వికారంగా అనిపిస్తుంది. కఫం ఎక్కువగా పడుతుంది. శరీరం ఫ్రీగా ఉండకుండా బిగుతుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏపని చేయాలన్నా కష్టంగా అనిపిస్తుంది.
6. ఒక్కోసారి కంటి చూపు కూడా తేడాగా మారుతుంది. చుట్టూ ఒక్కసారిగా చీకట్లు కమ్మినట్టు అనిపిస్తుంది. మళ్లీ వెంటనే సాధారణం అయిపోతుంది కానీ, అది మంచి లక్షణం మాత్రం కాదు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి