అంతరిక్షం.. ఓ అంతుచిక్కని రహస్యం. అక్కడ ఏం జరిగినా ఆ విశేషాలు తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలంగా ఉంటుంది. అయితే ఆసక్తికర విశేషాలు అయితే ఓకే.. కానీ ఒక్కోసారి భయపెట్టే విషయాలు కూడా ఉంటాయి. అవును.. తాజాగా అలాంటి వార్తే ఒకటి భయపెడుతోంది. ఓ భారీ గ్రహశకలం ఈ ఏడాది క్రిస్మస్‌కు ముందు (ఆస్ట్రాయిడ్) భూమికి అతి సమీపంగా రానుందట. దాదాపు ఈఫిల్ టవర్ అంత పొడవు ఉందట ఈ గ్రహశకలం.


భూమిని తాకితే..


'T4660 నేరియస్‌'గా పిలుస్తోన్న ఈ గ్రహశకలం చాలా శక్తిమంతమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్ భూమిని తాకితే చాలా ప్రమాదమని కొందరు భావిస్తున్నారు.


అయితే నాసా ఆస్ట్రాయిడ్ మానిటర్ కేంద్రం మాత్రం.. దీనివల్ల మానవాళికి ఎలాంటి ప్రమాదం లేదని చెబుతోంది. అయితే ఇది 90 శాతం ఇతర గ్రహశకలాల కంటే 330మీ పెద్దది.




కళ్లు చెదిరే స్పీడు..




సెకండ్‌కు 6.578కిమీ వేగంతో ఈ నేరియస్ ఆస్ట్రాయిడ్ ప్రయాణిస్తోంది. అంటే ఎఫ్-16 ఫైటర్ జెట్‌ టాప్ స్పీడ్‌ కంటే 11 రెట్లు వేగవంతం అన్నమాట.


డిసెంబర్ 11న ఈ గ్రహశకలం భూమికి 3.9 మిలియన్ కిమీ సమీపం నుంచి వెళ్లనుంది. అంటే భూమికి చంద్రుడికి మధ్య దూరం కంటే 10 రెట్లు ఎక్కువ దూరం అన్నమాట.






మళ్లీ ఎప్పుడంటే..


ఆ తర్వాత 23 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి 2060లో మళ్లీ భూమికి 1.2 మిలియన్ కిమీ సమీపానికి రానుంది. ఈ నేరియస్ అపోలో వంటి ఆస్ట్రాయిడ్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1981 సెప్టెంబర్ 30న దీన్ని తొలిసారి గుర్తించినట్లు స్పేస్ రిఫెరెన్స్ వెబ్‌సైట్ చెబుతోంది. అధునాతన హ్యూమన్ మేడ్ రాకెట్ ద్వారా దీనిపైన అధ్యయనం చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. నేరియస్ రహస్యాలు తెలుసుకునేందుకు హయాబుసా అనే వాహకనౌకను నేరియస్‌పైకి పంపాలని జపాన్ శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.


చాలా చూశాం..


అయితే ఇలాంటి ఆస్ట్రాయిడ్‌లు భూ కక్ష్యలోకి రావడం కొత్తేం కాదు. ఇంతకుముందు ఇలాంటివి చాలానే చూశాం. 2021RL3 అనే ఆస్ట్రాయిడ్ భూమికి 2.9 మిలియన్ కిమీ సమీపానికి వచ్చింది.


గోల్డెన్ గేట్ బ్రిడ్జి అంత పరిమాణం ఉన్న ఓ గ్రహశకలం ఈ ఏడాది మార్చిలో భూమికి దగ్గరగా వచ్చింది. 2021లో భూమికి దగ్గరగా వచ్చిన ఆస్ట్రాయిడ్‌లలో ఇదే అత్యంత పెద్ద, వేగవంతమైన గ్రహశకలం. అయితే నేరియస్ అంత దగ్గరగా రాకపోవడం ఊరటనిచ్చే విషయం.


భద్రత ఎలా?


సౌర కుటుంబంలో కొన్ని వేల కోట్ల ఆస్ట్రాయిడ్లు ఉన్నాయి. అందులో చాలా వరకు అంగారకుడికి, గురు గ్రహానికి మధ్య పరిభ్రమిస్తున్నాయి. కొన్ని తోకచుక్కల తరహాలో సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతున్నాయి. అలా ప్రయాణించే మార్గంలో ఇతర గ్రహాల కక్ష్యలను దాటుతూ వెళతాయి. గ్రహాలకు సమీపంగా వస్తాయి. ఆస్టరాయిడ్లలో కొన్ని మీటర్ల సైజు నుంచి కిలోమీటర్ల కొద్దీ పొడవున్నవి ఉంటాయి. భూమికి సమీపం నుంచి వెళ్లేవాటిలో కనీసం వంద మీటర్లు, ఆపై పరిమాణం ఉన్న ఆస్టరాయిడ్లను ప్రమాదకరమైనవిగా భావిస్తారు. ఏవైనా ఆస్టరాయిడ్లు భూమిని ఢీకొట్టే చాన్స్‌ ఉంటే.. వాటిపైకి క్షిపణులు, శాటిలైట్లు ప్రయోగించడం ద్వారా ముక్కలు చేయడం, లేదా కక్ష్యను మార్చి ప్రమాదాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.


Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే


Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి


Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే


Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే


Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?


Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి