India Corona Updates: దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నా ఆందోళన మాత్రం తగ్గడం లేదు. ఓరోజు పెరిగిన కరోనా కేసులు, మరోరోజు తగ్గుతున్నాయి. కొవిడ్19 మరణాలలో సైతం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,451 మంది కరోనా బారిన పడ్డారు. నిన్నటి కేసులతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో 266 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. కరోనా మరణాలు నిన్నటితో పోల్చితే సగానికి పైగా తగ్గడం శుభపరిణామంగా కనిపిస్తోంది. 


భారత్‌లో ప్రస్తుతం 1,42,826 (ఒక లక్షా 42 వేల 826) యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గత 262 రోజులలో ఇవే అతి తక్కువ క్రియాశీల కేసులు. మరోవైపు నిన్న ఒక్కరోజులో 13,204 మంది కరోనా మహమ్మారిని జయించారు. దాంతో కొవిడ్19 రికవరీ రేటు 98.24 శాతానికి చేరింది. మొత్తం కరోనా కేసులలో యాక్టివ్ కేసులు 0.42 శాతం ఉంది. గత ఏడాది నుంచి ఇదే తక్కువ శాతం క్రీయాశీల కేసులు అని బులెటిన్‌లో పేర్కొన్నారు.


Also Read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు






కేరళలో అత్యధికం..
దేశంలో మొత్తం నమోదైన మొత్తం కేసులలో 7,124 కేసులు కేరళలో నమోదయ్యాయి. రికవరీలలో సైతం 7,488 మంది ఈ రాష్ట్రం నుంచి కోలుకున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు.
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే 


ఏపీలో గడిచిన 24 గంటల్లో 38,768 మంది శాంపిల్స్ పరీక్షించగా 320 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో ఐదుగురు మృతి చెందారు. కరోనా నుంచి శనివారం 425 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,458 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. గుంటూరులో ఇద్దరు, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో  ఒకరు చొప్పున మృతి చెందారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి