కరోనా ఆట కట్టించాలంటే ఒకటే మార్గం... వ్యాక్సినేషన్. అందుకే అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ లు జోరుగా సాగుతున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్లు వేయించుకోవాలని అన్ని దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థలు పిలుపునిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఓ పాతికేళ్ల అమ్మాయి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వ్యాక్సిన్ వేయించుకుంది. ప్రతిఫలంగా ఏడున్నర కోట్ల రూపాయలు బహుమతిగా దక్కించుకుంది. ఆమె పేరు జోన్నే జూ. 


‘ద మిలియన్ డాలర్ వ్యాక్స్ అలియన్స్’... ఇదొక వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం. ప్రజలందరూ వ్యాక్సినే వేసుకునేలా ప్రోత్సహించడం కోసం దీన్ని ఆస్ట్రేలియాలోని కొన్ని సంస్థలు, ఎన్జీవోలు కలిపి ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ప్రకారం వ్యాక్సిన్ వేయించుకున్న వారిలోంచి ఒకరిని లక్కీ డ్రా తీసి ఒక విజేతకు ఒక మిలియన్ డాలర్లను ప్రైజ్ మనీగా ఇస్తారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని 30 లక్షల మంది పౌరులు తమ పేరును నమోదు చేయించుకున్నారు. పేర్ల నమోదుకు కూడా ముందుగా ఓ ప్రక్రియ నడిచింది. ప్రభుత్వ ఆరోగ్య సంస్థ నుంచి వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా అనే కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్టు చేసి వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సమాధానమివ్వాలి. అలా జోన్నేకు కూడా కాల్ వచ్చింది. ఆ కాల్ ద్వారానే తన పేరును వ్యాక్సినేషన్ లాటరీ డ్రాలో నమోదు చేయించుకుంది. 


రెండున్నర కోట్ల జనాభా ఉన్న ఆస్ట్రేలియాలో దాదాపు  30 లక్షల మంది లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసిన సంస్థల ప్రతినిధులు డ్రా తీసి విజేతను ప్రకటించారు. తనే విజేత అవుతుందని జూనో ఊహించలేదు. తన పేరు చెప్పగానే ఆనందంతో ఎగిరి గంతులేసింది. ఒక్కరాత్రిలోనే తన జీవితమే మారిపోయిందని చెబుతోంది జూనో. నిజమే అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఊహించడం కష్టమే. 


Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే


Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి


Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే


Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి