దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2020కిగాను పద్మా పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా సహా ప్రముఖులు హాజరయ్యారు.
119 మందికి..
2020 ఏడాదికి మొత్తం 119 మందికి పద్మ పురస్కారాలు ఇచ్చారు. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి.
వీరికే పురస్కారాలు..
- విదేశాంగ మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్‌కు పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్రం. ఈ పురస్కారాన్ని ఆమె కూతురు బన్సూరి స్వరాజ్ స్వీకరించారు.
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్రం.
- జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
- భారత స్టార్ షట్లర్ పీవీ సింధూను పద్మ భూషణ్ అవార్డు వరించింది.
- అసోం మాజీ సీఎం, దివంగత తరుణ్ గొగొయ్, గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్, కేంద్ర మాజీమంత్రి, దివంగత రాంవిలాస్ పాసవాన్‌ను పద్మభూషణ్‌తో గౌరవించారు.
- నటి కంగనా రనౌత్ సహా మరికొంతమంది ప్రముఖులను పద్మశ్రీ పుసర్కారంతో సత్కరించింది కేంద్రం
వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌తో కేంద్రం ప్రతి ఏటా సత్కరిస్తోంది.
Also Read: Chhattisgarh Firing: తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు
Also Read: Asteroid Towards Earth: 'F16'.. F2 సీక్వెల్ కాదు.. అంతకుమించి! దాక్కో దాక్కో.. దూసుకొస్తోంది!
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి