ఇటీవల 'సీటీమార్' సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న గోపిచంద్.. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' అనే సినిమాలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయగా.. అది యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. తాజాగా సినిమా టీజర్ ను వదిలారు. టైటిల్ కి తగ్గట్లే కమర్షియల్ ఎలిమెంట్స్ తో టీజర్ ను నింపేశారు.
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..
ముందుగా కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూపించి.. 'ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు.. నేనెప్పుడో చేసి, చూసి వచ్చేశా' అంటూ హీరో చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. 'నా హీరోయిజానికి ఓ ఆరా ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుంచి ఒక ఆర్ఆర్ వినిపిస్తుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి.. కిక్కాస్ ఉంటుంది' అంటూ హీరో చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
టీజర్ లో రాశిఖన్నాని ఓ సీన్ లో చూపించారు. ఆమెకొక చిన్న డైలాగ్ కూడా ఉంది. అలానే సత్యరాజ్, రావు రమేష్ ల క్యారెక్టర్లను పరిచయం చేసే ప్రయత్నం చేశారు. టీజర్ ని బట్టి చూస్తుంటే సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయనిపిస్తుంది. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి