ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. చిలకలగూడలో నమోదైన కేసులో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన మల్లన్నకు ఆయన అనుచరులు, అభిమానులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం అక్కడనుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు డిమాండ్ చేశారని తీన్మార్ మల్లన్నపై ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా ఆగస్టులో ఆయన అరెస్టు అయ్యారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు కాగా అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇదివరకే బెయిల్ వచ్చింది. పెండింగ్‌లో ఉన్న మరో కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న 74 రోజులుగా జైల్లో ఉన్నారు. దీంతో బెయిల్ మంజూరు కోసం తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యారు.
ఇప్పటికే తీన్మార్ మల్లన్న భార్య.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఎంపీ అరవింద్ కుమార్, సోదరుడితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆమె అమిత్ షాను కలిసి తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. అక్రమంగా కేసులు పెట్టి మల్లన్నను వేధిస్తున్నారని ఆరోపించారు. కేసు మీద కేసు పెడుతూ జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మల్లన్నపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖను గతంలోనే అమిత్ షాకు అందించారు. మల్లన్న బీజేపీలో చేరబోతున్నట్టు ఇటీవలే క్యూ న్యూస్ ఛానల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కోర్టులో చుక్కెదురు.. ఇక నేటి నుంచి..
Also Read: Theenmaar Mallanna: తీన్మార్ మల్లన్న అరెస్టు.. ఓ జ్యోతిష్యుడి ఫిర్యాదు వల్లే.. అసలేం జరిగిందంటే..
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు
Also Read: Anantapur News: అనంత విద్యార్థులపై విరిగిన లాఠీ... ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత