'రాజా విక్రమార్క' సినిమాకు, మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఓ సంబంధం ఉంది. అదేంటంటే... ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీ సరిపల్లి సీబీఐ కాలనీ పక్కన ఉండేవారు. ఆయన ఇంటి ఇంటికిలోంచి చూస్తే సీబీఐ కాలనీలో ఇళ్లు కనిపించేవి. ఒక ఇంట్లో యంగ్ ఆఫీసర్ ఈ కథకు స్ఫూర్తి అని శ్రీ సరిపల్లి చెప్పారు.


హీరో పాత్రకు స్ఫూర్తి గురించి శ్రీ సరిపల్లి మాట్లాడుతూ "మా కిటికీలోంచి ఒక ఆఫీసర్ కనిపించేవారు. ఆయన డ్రైవర్ లేదా చిన్న పోస్టులో పని చేస్తారని అనుకున్నాను. తర్వాత జీడీ లక్ష్మీనారాయణ గారి బృందంలో ఆయన ఇంపార్టెంట్ పర్సన్ అని తెలిసింది. నేను అనుకున్నట్టు ఆయన గురించి చాలామంది అనుకుని ఉంటారు కదా!" అని అన్నారు. అలా జీడీ లక్ష్మీనారాయణ బృందంలో వ్యక్తి 'రాజా విక్రమార్క'లో హీరో పాత్రకు స్ఫూర్తిగా మారారు.
Also Read: పెళ్లి కబురు చెప్పిన కార్తికేయ... ఆ తర్వాత కాబోయే భార్యను పిలిచి!
దర్శకుడిగా శ్రీ సరిపల్లికి తొలి చిత్రమిది. అమెరికాలో ఫిలిం మేకింగ్ కోర్స్ చేసిన ఆయన... అక్కడ కొన్ని ఇండిపెండెంట్ సినిమాలకు వర్క్ చేశారు. ఆ తర్వాత వీవీ వినాయక్ దగ్గర 'నాయక్', 'అల్లుడు శీను' సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశారు. ఇప్పుడు 'రాజా విక్రమార్క'తో దర్శకుడిగా మారుతున్నారు. ఇందులో యాక్షన్, సందర్భానుసారంగా వినోదాత్మక సన్నివేశాలు ఉంటాయని శ్రీ సరిపల్లి చెప్పారు. తొలుత యంగ్ హీరో ఎవరితోనైనా సినిమా తీద్దామని అనుకున్నారట. ''ఆర్ఎక్స్ 100' చూశాక కార్తికేయ లుక్స్ బావున్నాయని అనుకున్నాను. ఆ తర్వాత అతడిలో 'రాజా విక్రమార్క' సినిమాలో హెర్ప్ పాత్రకు అవసరమైన కామెడీ టైమింగ్ ఉందని తెలిసింది. వెళ్లి కథ చెప్పా. అతనికి నచ్చింది. తొలుత కార్తికేయ సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. వివిధ కారణాల వల్ల నిర్మాతలు మారారు" అని శ్రీ సరిపల్లి చెప్పారు.


తీవ్రవాదులపై మాత్రమే దేశంలో అంతర్గత సమస్యలపై ఎన్ఐఏ పోరాడుతుందని, మా సినిమాలో అంతర్గత సమస్యలపై ఎన్ఐఏ పోరాడుతుందని శ్రీ సరిపల్లి తెలిపారు. నవంబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది.


Also Read: ఖం... ఖం... ఖంగుమంది 'అఖండ' శంఖం! ధర్మభేరి శబ్దం... చెయ్యమంది యుద్ధం!
Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గ‌ణేష్‌... ప‌వ‌న్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటావా?
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి