త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ పాట రాశారు. మాటల మాంత్రికుడికి పాట రాయడం పెద్ద కష్టమా? ఏంటి? అందులో వింత ఏముంది? అనుకుంటున్నారా! త్రివిక్ర‌మ్‌కు పాట రాయడం పెద్ద కష్టమేమీ కాదు. గతంలో 'ఒక రాజు ఒక రాణి' సినిమాలో పాటలన్నీ ఆయనే రాశారు. అయితే... ఆ తర్వాత సాహిత్య రచనకు దూరంగా ఉన్నారు. ఎందుకు? అని ప్రశ్నిస్తే... పాట రాయడంలో ఉన్న కష్టం తెలుసన్నారు. కష్టమని చెప్పారు.

"ఐదు పాటలు ('ఒక రాజు ఒక రాణి' సినిమాలో) రాసిన తర్వాత... పాటలు రాయకూడదని తెలుసుకున్నాను. ఎందుకంటే... పాట రాయడంలో ఉన్న కష్టమేంటో నాకు తెలుసు. పాట రాసేటప్పుడు కథలో కంటెంట్ ఏమో ఓపెన్ చేయకూడదని అంటారు. అస్పష్టంగా చెప్పాలని అంటారు. చాలా కష్టం" అని 'అల వైకుంఠపురములో' పాటలు రాసిన గేయ రచయితలతో కూర్చున్నప్పుడు త్రివిక్రమ్ చెప్పారు. 'ఒక రాజు ఒక రాణి' 2003లో విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే పాట రాశారు.
AlsoRead: దంచికొట్టు... కత్తిపట్టు... అదరగొట్టు... పవన్ పాట వింటే పూనకాలే!

సుమారు 18 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ పాట రాశారు. 'భీమ్లా నాయక్'లో 'లాలా... భీమ్లా నాయక్' పాటను రాసింది ఆయనే. ఆప్తమిత్రుడు పవన్ కల్యాణ్ కోసం ఆయన పెన్ను నుంచి పాట రావడం విశేషమే కదా!

"పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు... పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు" వంటి లైన్లలో త్రివిక్రమ్ మార్క్ కనిపించింది. "ఒడిసి పట్టు... దంచి కొట్టు... కత్తి పట్టు... అదరగొట్టు" బాణీకి తగ్గట్టు సాహిత్యం అందించారు. తమన్ సంగీతం, అరుణ్ కౌండిన్య గాత్రం, త్రివిక్రమ్ సాహిత్యం... మూడు కలిసి పాటను హిట్ చేశాయి. పవన్ పాత్రలో ఆవేశానికి తగ్గట్టు ఉందీ పాట. పాటల గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ "తొంభై శాతం పాటలు అమ్మాయి, అబ్బాయి మధ్య అనుబంధం గురించి ఉంటాయి. లేదంటే పాటల్లో కుటుంబ సంబంధాల గురించి చెప్పాలి. ఒక దశ దాటిన తర్వాత వెతకడానికి అలసిపోతాం. ఆరు అడుగుల నెలలో అరవై రకాల పంటలు ఎక్కడ పండించగలం?" అని అన్నారు. ఇప్పుడు ఆయన రాసిన పాట అమ్మాయి, అబ్బాయి మధ్య అనుబంధం గురించో... కుటుంబ సంబంధాల గురించో కాదు. సినిమాలో హీరో పోరాట గీతం. రెగ్యులర్ పాటలకు భిన్నమైన గీతమిది. 


Also Read: పెళ్లి కబురు చెప్పిన కార్తికేయ... ఆ తర్వాత కాబోయే భార్యను పిలిచి!
Also Read: మంగళం శీను మామూలుగా లేడుగా... విల‌న్‌గా సునీల్ లుక్ చూశారా?
Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!
Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం
Also Read: దంచికొడితే రోలు పగిలిందంతే... జయమ్మగా సుమ కనకాలను చూశారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి