'లా లా... భీమ్లా... అడవిపులి... గొడవపడి...' - ఈ లిరిక్స్ 'భీమ్లా నాయక్' సినిమా నుంచి విడుదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టీజర్‌లో వినిపించాయి. నవంబర్ 7న సాంగ్ విడుదల అంటూ దీపావళి కానుకగా వదిలిన ప్రోమోలోనూ వినిపించాయి. అందువల్ల, ఈ లిరిక్స్ ప్రేక్షకులకు అలవాటు అయ్యాయి. అయితే... పాట ఎలా ఉంటుందోననే ఆసక్తి మొదలైంది. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సాంగ్ విడుదల చేశారు. 'లాలా... భీమ్లా... అడవిపులి... గొడవపడి... ఒడిసిపట్టు... దంచికొట్టు... కత్తిపట్టు... అదరగొట్టు..." అంటూ సాగిన ఈ గీతాన్ని త్రివిక్రమ్ రాశారు. 'పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు... పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు' త్రివిక్రమ్ మార్క్ లిరిక్స్ అని చెప్పాలి


సినిమాలో పవన్ కల్యాణ్‌ను పాత్రను పరిచయం చేశారు కదా! అందులో ఆయన ఆవేశంగా కనిపించారు. ఆ ఆవేశానికి తగ్గట్టు తమన్ సాంగ్ కంపోజ్ చేశారు. ఈ పాట వింటుంటే... పవన్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్టు అర్థమవుతోంది. ఇతర ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంది. డ్రమ్స్, బీట్స్ తో సాంగ్ మాసీగా ఉంది. ఈ సాంగ్ వింటే పవన్ కల్యాణ్ అభిమానులకు పూనకాలు రావడం గ్యారెంటీ అన్నట్టు ఉంది. అరుణ్ కౌండిన్య సాంగ్ పాడారు.





పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తున్న ఈ సినిమా మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్'కు రీమేక్. ప్రచార చిత్రాలు చూస్తుంటే తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసినట్టు అర్థమవుతోంది. ఇందులో రానా దగ్గుబాటి మరో హీరో. ఆయన సరసన సంయుక్తా మీనన్ కనిపించనున్నారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించడంతో పాటు ఓ పాట కూడా రాశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. 


Also Read: పెళ్లి కబురు చెప్పిన కార్తికేయ... ఆ తర్వాత కాబోయే భార్యను పిలిచి!


Also Read: మంగళం శీను మామూలుగా లేడుగా... విల‌న్‌గా సునీల్ లుక్ చూశారా?


Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!


Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం


Also Read: దంచికొడితే రోలు పగిలిందంతే... జయమ్మగా సుమ కనకాలను చూశారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి