నట సింహం నందమూరి బాలకృష్ణను అభిమానులు కోరుకొనే విధంగా చూపిస్తూ... అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమాలు తీసే దర్శకుడు బోయపాటి శ్రీను. 'సింహ', 'లెజెండ్' సినిమాలు గానీ... వాటిలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ గానీ ఎంత పెద్ద హిట్ అయ్యాయనేది ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఇప్పుడు 'అఖండ'లో కూడా అటువంటి ఎపిసోడ్ ఒకటి ఉంది. తొలుత విడుదల చేసిన టీజ‌ర్‌లో బాలకృష్ణను మాస్ హీరోగా చూపించిన బోయపాటి శ్రీను... నుదుట నామాలు, చేత త్రిశూలంతో అఘోరా కింద మరో కోణంలో చూపించిన సంగతి తెలిసిందే. 'అఖండ' టైటిల్ సాంగ్ లో అఘోరాగా కనిపించారు.






'ఖం... ఖం... ఖంగుమంది 'అఖండ' శంఖం! కడగమంది పంకం! చావుకైన జంకం! ధం... ధం... ధర్మభేరి శబ్దం! చెయ్యమంది యుద్ధం! దేనికైన సిద్ధం' అంటూ మొదలైన 'అఖండ' టైటిల్ సాంగ్‌ ఆద్యంతం శక్తివంతమైన పదాలతో సాగింది. అనంత శ్రీరామ్ ఈ పాటను రాశారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్... అందుకు తగ్గట్టు సంగీతం సమకూర్చారు. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే... ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన ఇద్దరు కుమారుడు సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ కలిసి పాడటం!


బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. 



Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గ‌ణేష్‌... ప‌వ‌న్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటావా?
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
Also Read: పెళ్లి కబురు చెప్పిన కార్తికేయ... ఆ తర్వాత కాబోయే భార్యను పిలిచి!
Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!
Also read: ‘సూర్యవంశీ’ స్క్రీనింగ్ ను అడ్డుకున్న రైతులు... కేంద్రం మీద ఉన్న కోపం అక్షయ్‌పై చూపించారుగా
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి