మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ప్రకటన వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా ప్రకటన తర్వాత అందరికీ వచ్చిన సందేహం ఒక్కటే... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రకటించిన 'స్టూవ‌ర్ట్‌పురం దొంగ' సినిమా ఏమైంది? అని! ఆ సినిమా ఆగిందని, బెల్లంకొండ దగ్గర నుంచి రవితేజ వద్దకు దర్శకుడు వంశీ వచ్చాడని భావించారు. అది నిజమే!


Also Read: రవితేజ వర్సెస్ బెల్లంకొండ... రియల్ టైగర్ ఎవరు? ఎవరి టైగర్ ముందు?


తొలుత టైగర్ నాగేశ్వరరావు దగ్గరకు వెళ్లిన వంశీ, ఆ తర్వాత రవితేజ దగ్గరకు వచ్చాయి. అయితే... 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ప్రకటన వచ్చిన తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'స్టూవ‌ర్ట్‌పురం దొంగ' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 'బయోపిక్ ఆఫ్ టైగర్' అనేది ఉపశీర్షిక. దాంతో టైగర్ నాగేశ్వరరావు జీవితం మీద రెండు సినిమాలు వస్తున్నాయని స్పష్టం అయ్యింది. ఒకే కథతో రెండు సినిమాలు తెరకెక్కితే... అనే సందేహం కలిగింది. బహుశా... అటు రవితేజ చిత్రబృందానికి, ఇటు బెల్లంకొండ టీమ్‌కు సేమ్ డౌట్ వచ్చిందేమో!? చర్చల్లోకి దిగారు.


ప్రస్తుతం రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మాస్ మహారాజ్ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్, బెల్లంకొండ ఫ్యామిలీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 'సీత' సినిమాను అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరావు బయోపిక్ గురించి చర్చల్లో దిగారు. డిస్కషన్స్ రిజల్ట్ గురించి ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.