లఖింపుర్ ఖేరి కేసులో ఉత్తర్‌ప్రదేశ్ విచారణ తీరుపై సుప్రీం కోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు తాము ఆశించినట్లుగా జరగడం లేదని వ్యాఖ్యానించింది. విచారణను హైకోర్టు మాజీ న్యాయమూర్తితో జరిపించాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్, జస్టిస్ రంజిత్ సింగ్‌ల పేర్లను ఇందుకోసం సిఫారసు చేసింది.
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రోజు వారీ విచారణను పర్యవేక్షిస్తారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లు ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాను రక్షించేలా కనిపిస్తున్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. రెండు ఎఫ్‌ఐఆర్‌లను వేర్వేరుగా విచారించాలని సూచించింది. నిందితుల ఫోన్ కాల్ వివరాలు ఇవ్వాలని యూపీ సర్కార్‌కు ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను నవంబర్ 12కు వాయిదా వేసింది.
ఇదీ కేసు..
ఇటీవల యూపీలోని లఖింపుర్ ఖేరిలో నిరసన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు. వాహనంలో ఉన్న నలుగురు భాజపా కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. అయితే కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేంద్ర మంత్రి కుమారు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు యూపీ సర్కార్, పోలీసులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. మొత్తానికి ఆశిష్ మిశ్రా సహా మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Padma Awards 2021: సుష్మా స్వరాజ్, పీవీ సింధూ, కంగనా రనౌత్ సహా 119 మందికి పద్మ పురస్కారాలు
Also Read: Chhattisgarh Firing: తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు
Also Read: Asteroid Towards Earth: 'F16'.. F2 సీక్వెల్ కాదు.. అంతకుమించి! దాక్కో దాక్కో.. దూసుకొస్తోంది!
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి