ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల వ్యవధిలో 28,855 కరోనా పరీక్షలు చేయగా.. 246 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,401కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 334 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,50,720 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,366 యాక్టివ్ కేసులున్నాయి.
చిత్తూరులో 41, తూర్పుగోదావరిలో 80, గుంటూరులో 31, కడపలో 13, కర్నూలులో 1, నెల్లూరులో 11, ప్రకాశంలో 10, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 29, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఒక్క కేసూ నమోదు అవ్వలేదు.