మోటో ఈ30 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ గతంలో లాంచ్ అయిన మోటో ఈ30 తరహాలో ఉంది. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లే డిజైన్, వెనకవైపు మూడు కెమెరాలు, 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫాంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


మోటో ఈ30 ధర
దీని ధర 5,29,900 కొలంబియన్ పెసోలుగా(సుమారు రూ.10,200) నిర్ణయించారు. ఇందులో కేవలం 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌ను మాత్రమే అందించారు. కొలంబియా, స్లొకోవియా వంటి దక్షిణ అమెరికా దేశాల్లో ఇది అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.


మోటో ఈ30 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.


2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 198 గ్రాములుగా ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. దీంతోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉంది. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకభాగంలో అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 40 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుందని తెలుస్తోంది.


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!


Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?


Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి