శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్‌లో కొత్త 5జీ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ ఆంథోనీ ట్వీటర్‌లో లీక్ చేశారు.


దీనికి సంబంధించిన ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. దీని ప్రకారం అమెరికాలో శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ ధర 249 డాలర్లుగా(మనదేశ కరెన్సీలో సుమారు రూ.18,600) ఉండే అవకాశం ఉంది. శాంసంగ్ లాంచ్ చేయనున్న అత్యంత 5జీ ఫోన్ ఇదే అయ్యే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం మనదేశంలో ఈ ఫోన్ రూ.15 వేల రేంజ్‌లో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.


శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ కీలక స్పెసిఫికేషన్లు
లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.48 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్‌ను అందించనున్నారు. దీని రిజల్యూషన్ ఫుల్ హెచ్‌డీ+గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండనున్నాయి.


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీ కెమెరా గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీకి సంబంధించిన రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీని ప్రకారం ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ ఉండనుంది. డిస్ ప్లే చుట్టూ అంచులు కాస్త మందంగా ఉన్నాయి. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 83.4 శాతంగా ఉంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.


యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌లను ఫోన్ కింద భాగంలో అందించారు.  బ్లాక్, బ్లూ, రెడ్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది.


Also Read: జియో స్మార్ట్‌ఫోన్ ధర ప్రకటించిన కంపెనీ.. రూ.1,999కే కొనేయచ్చు.. రీచార్జ్ ప్లాన్లు ఇవే!


Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!


Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!


Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి