రెడ్‌మీ నోట్ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్లు అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఇందులో మూడు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవే రెడ్‌మీ నోట్ 11 5జీ, రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్. వీటిలో సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు అందించారు. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 11 5జీ ధర
ఇందులో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 1,199 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.14,000) నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,299 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.16,400) ఉండగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.18,700) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,699 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.21,100) నిర్ణయించారు. బ్రాక్ రియల్మ్, షాలో డ్రీమ్ గెలాక్సీ, స్లైట్ మింట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ నోట్ 11 ప్రో 5జీ ధర
షియోమీ ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ చేసింది. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.18,700) ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,899 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.22,300), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,099 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.24,500) నిర్ణయించారు.
రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ ధర
ఇందులో కూడా మూడు వేరియంట్లే ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,899 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.22,200) ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,099 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.24,500), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.26,900) నిర్ణయించారు.
ఈ రెండు ఫోన్లను మిస్టీ ఫారెస్ట్, మిస్టీరియస్ బ్లాక్, షాలో డ్రీమ్ గెలాక్సీ, టైమ్ క్వైట్ పర్పుల్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 1వ తేదీ నుంచి చైనాలో వీటి సేల్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఫోన్లు మనదేశంలో చాలా ఫేమస్ కాబట్టి త్వరలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రెడ్‌మీ నోట్ 11 5జీ స్పెసిఫికేషన్లు
రెడ్‌మీ నోట్ 11 5జీలో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. వీటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను ముందువైపు అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది ఐపీ53 రేటింగ్‌లో మార్కెట్లోకి వచ్చింది.
రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు
ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. కేవలం బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ అంశాల్లో మాత్రమే కొన్ని తేడాలు ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రోలో మాత్రం 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 67W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
వీటిలో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హోల్ పంచ్ డిజైన్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌పై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి. వీటిలో 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.
రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లలో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. ఈ ఫోన్లలో జేబీఎల్ ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లు అందించారు. డాల్బీ అట్మాస్, హై రెస్ ఆడియో సపోర్ట్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!