జియోఫోన్ నెక్స్ట్‌ను కంపెనీ ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధరను కూడా కంపెనీ ప్రకటించింది. దీంతోపాటు ఈ ఫోన్ పూర్తి ఫీచర్లను కూడా కంపెనీ రివీల్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ నవంబర్ 4వ తేదీ నుంచి జరగనుంది.


జియోఫోన్ నెక్స్ట్ ధర
ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.1,999కే అందిస్తున్నామని జియో అంటోంది. అయితే రూ.1,999తో కొనుగోలు చేస్తే తర్వాత ఫైనాన్సింగ్ రూపంలో మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ ద్వారా వద్దు అనుకుంటే రూ.6,499తో ఫోన్‌ను ఒకేసారి కొనుగోలు చేయవచ్చు. అయితే ఫైనాన్సింగ్‌ను జియోకు నగదు రూపంలో కాకుండా రీచార్జ్ రూపంలో చెల్లించాలి.


అంటే మీరు నెలవారీ రీచార్జ్ ప్లాన్లు చేసుకుంటే సరిపోతుందన్న మాట. ఇందులో జియో కొన్ని ప్లాన్లు అందించింది. ఈ ప్లాన్లు రూ.300 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆల్వేస్ ఆన్, లార్జ్, ఎక్స్ఎల్, ఎక్స్ఎక్స్ఎల్ ప్లాన్లలో ఈ ఈఎంఐ కూడా కవర్ కానుంది. వీటిలో ఆల్వేస్-ఆన్ 24 నెలల ప్లాన్‌ను ఎంచుకుంటే నెలకు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. 18 నెలల ప్లాన్ ఎంచుకుంటే నెలకు రూ.350 చెల్లించాలి. ఈ ఆల్వేస్-ఆన్ ప్లాన్ ద్వారా నెలకు 5 జీబీ డేటా, 100 నిమిషాల టాక్ టైం అందించనున్నారు.


లార్జ్ ప్లాన్ ఎంచుకుంటే.. ఇందులో కూడా 18 నెలల ప్లాన్, 24 నెలల ప్లాన్ ఉండనుంది. వీటిలో 24 నెలల ప్లాన్ ఎంచుకుంటే నెలకు రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. అదే 18 నెలల ప్లాన్ అయితే.. నెలకు రూ.500 చెల్లించాలి. ఈ ప్లాన్‌ ఎంచుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభించనున్నాయి.


ఇక ఎక్స్ఎల్ ప్లాన్ తీసుకుంటే.. ఇందులో 18 నెలల ప్లాన్‌కు నెలకు రూ.500, 24 నెలల ప్లాన్‌కు నెలకు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభించనున్నాయి. ఎక్స్ఎక్స్ఎల్ ప్లాన్‌తో 24 నెలల ప్లాన్‌కు రూ.550, 18 నెలల ప్లాన్‌కు రూ.600 లభించనున్నాయి. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా లభించనుంది.


జియో ఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేషన్లు
ఇందులో 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్‌గా ఉంది. మైక్రో యూఎస్‌బీ పోర్టును ఇందులో అందించారు. డ్యూయల్ సిమ్ కార్డు స్లాట్ కూడా ఇందులో ఉంది.


Also Read: Apple Macbook Pro(2021): కొత్త మ్యాక్‌బుక్ ప్రోల సేల్ వాయిదా.. ఎప్పుడు కొనేయచ్చంటే?


Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!


Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి