పునీత్ రాజ్ కుమార్ మరణించాడనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందని హీరోయిన్ అనుష్క పేర్కొన్నారు. పునీత్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆమె తెలిపారు. అతను ఎంతో మంచి వ్యక్తి అని చెప్పారు. పునీత్ కుటుంబ సభ్యులకు, అతడిని అమితంగా ప్రేమించే మన అందరికీ ఈ విషాదం నుండి తేరుకునే శక్తి ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు అనుష్క తెలిపారు. "నువ్వు ఎప్పుడూ మా గుండెల్లో ఉంటావ్. ఎప్పటికీ ఉంటావ్. రెస్ట్ ఇన్ పీస్" అని అనుష్క సోషల్ మీడియాలో పేర్కొన్నారు.






"నేను విన్నది నమ్మలేకపోతున్నాను. జీవితం అనూహ్యమైనది. ఊహించలేం. ఇండియన్ సినిమాకు పెద్ద లాస్ ఇది. రెస్ట్ ఇన్ పీస్ పునీత్ రాజ్ కుమార్. నా తొలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన అతిథిగా వచ్చారు. చాలా మంచి మనిషి. పునీత్ అకాల మరణం చాలా బాధాకరం. ఈ విషాద సమయం నుండి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. వాళ్లను తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది" అని పూజా హెగ్డే ట్వీట్ చేశారు.  











ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి