కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సడెన్‌గా గుండెపోటుతో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తన నటన, డ్యాన్స్, ఫైట్స్‌తో ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ ట్యాగ్ కూడా పునీత్ సొంతం. ప్రస్తుతం కన్నడలో టాప్ లీగ్ స్టార్లలో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఒకడు. ఇంత స్టార్‌డం సంపాదించుకున్న పునీత్ రాజ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేసింది మన తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్.


2002లో ‘అప్పు’ అనే సినిమాతో పునీత్ రాజ్‌కుమార్‌ను పూరి జగన్నాథ్ హీరోగా పరిచయం చేశాడు. అంతకుముందు బాలనటుడిగా పునీత్ ఎన్నో సినిమాలు చేసినా.. మొదటి సినిమాతోనే తనను పూరి స్టార్‌ను చేశాడు. ఈ సినిమానే తెలుగులో రవితేజతో ‘ఇడియట్’ పేరుతో రీమేక్ చేయగా.. ఈ సినిమా మాస్ మహరాజ్ కెరీర్‌ను కూడా మలుపు తిప్పింది.


అంతకుముందు 2001లో పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్‌తో తమ్ముడు సినిమాని యువరాజాగా రీమేక్ చేసి పూరి హిట్ కొట్టాడు. దీంతో రాజ్‌కుమార్ పిలిచి మరీ పునీత్‌ను లాంచ్ చేసే అవకాశం పూరి చేతిలో పెట్టారు. ఈ సినిమాల ఎన్నో భాషల్లో అధికారికంగా రీమేక్ అయింది.


తెలుగులో రవితేజ హీరోగా ఇడియట్ పేరుతో, తమిళంలో శింబు హీరోగా దమ్ పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. బెంగాలీ, బంగ్లాదేశీ భాషల్లోకి కూడా ఈ సినిమా రీమేక్ అయింది. ఈ రెండు భాషల్లోకి రీమేక్ అయిన రెండో కన్నడ సినిమా ఇదే. ఆ తర్వాత పునీత్ రాజ్‌కుమార్ కెరీర్ పరుగులు పెట్టింది.


ఎన్నో తెలుగు సూపర్ హిట్ సినిమాలను పునీత్ కన్నడలో రీమేక్ చేశారు. తెలుగు హీరోలతో కూడా తనకు సత్సంబంధాలు ఉన్నాయి. చక్రవ్యూహ సినిమాలో గెలయా గెలయా పాటను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాడాడు. బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్ వంటి హీరోలతో పునీత్ ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. ఇప్పుడు తన మృతితో తెలుగు ఇండస్ట్రీ కూడా షాక్‌లోకి వెళ్లింది.


Also Read: 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!


Also Read: సామి... సామి... సాంగ్ వచ్చిందిరా సామి!


Also Read: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడుతున్న వారెవరంటే..?


Also Read: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి