తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ బ్రేక్ వేసింది. పర్యావరణ అనుమతులు పూర్తి స్థాయిలో లభించిన తర్వాతే ముందుకెళ్లాలని ఆదేశించింది.  తాగునీటి కోసం ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను సాగునీటి కోసం విస్తరించటాన్ని ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీలో పిటిషన్ వేసింది. ఏపీకి చెందిన కొంతమంది రైతులు కూడా తమ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై ఎన్జీటీ సుదీర్ఘంగా వాదనలు విన్నది. రెండు వర్గాల వాదనలు విన్న తర్వాతప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు కేంద్ర అటవిశాఖ అనుమతులు తప్పనిసరి అని గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది.


Also Read : ఎమ్మెల్యే రఘునందన్ రావు హౌస్ అరెస్టు.. కలెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్


తాగునీటి కోసం అంటూ అధిక సామర్థ్యమున్న రిజర్వాయర్లను తెలంగాణ ప్రభుత్వం కడుతున్నదనీ, అయితే అసలు ఉద్దేశం మాత్రం సాగునీటి కోసమేనని ఏపీ ప్రభుత్వం వాదించింది.  ఎన్జీటీలో పిటిషన్‌దాఖలుకు ఆరు నెలల కాలపరిమితి ఉంటుందనీ, ఆ సమయం మించి దాఖలు చేసిన పిటిషన్లను విచారించరాదని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామని..పర్యావరణ అనమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని ఎన్జీటీకి తెలిపారు. 


Also Read: Siddipet: మంత్రి హరీశ్ ఇలాకాలో కలెక్టర్ తీవ్ర వ్యాఖ్యలు.. ‘గవర్నమెంట్ బ్లాక్ మెయిల్’ అని రేవంత్ రెడ్డి ఫైర్


వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేండ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్లు కడుతున్నదని .. ప్రాజెక్టు సమీప 13 మండలాలు ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాలనీ, భూగర్భజలాలు వినియోగం వల్ల ఇబ్బందుల వస్తున్న నేపథ్యంలోనే భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ప్రజాప్రయోజనాలు మాత్రమే ఉన్నాయన్నారు. అండర్‌టేకింగ్‌ ఇచ్చినట్టుగా తాగునీటి కోసమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని తెలంగాణ వాదించింది.


Also Read : మంత్రులకు జీహెచ్ఎంసీ షాక్... టీఆర్ఎస్ ఫ్లెక్సీలకు భారీగా జరిమానాలు...


ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రిజర్వాయర్ల పనులు దాదాపుగా పూర్తయ్యాయి.  మొత్తం 18ప్యాకేజీల్లో పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదుల రిజర్వాయర్‌ పనులు 100శాతం పూర్తయ్యాయి. ఉదండాపూర్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం తాగునీటికి మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. సాగునీటికి అనుమతులు రావాల్సి ఉంది. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్  కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలిసి ప్రాజెక్టు తుది అనుమతులు త్వరగా ఇవ్వాలని కోరారు. ఆ అనుమతులు వచ్చే వరకూ ప్రాజెక్టు పనులు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


Also Read: అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి