దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హౌజ్ అరెస్టు అయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో పోలీసులు ఆయన్ను బయటికి రానివ్వకుండా బంధించారు. రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రైతులకు తీవ్రమైన హెచ్చరికలు ఆయన చేశారు. వరి విత్తనాలు వేస్తే ఊరుకునేది లేదని యాసంగిలో వరి పంటను వేయొద్దని, డీలర్లు వరి విత్తనాలు అమ్మితే లైసెన్సు రద్దు చేస్తామని వెంకట్రామి రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ రావు మండిపడ్డారు. కలెక్టర్ ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నాడని.. మాట్లాడిన తీరు బాధకలిగించిందని రఘునందన్ రావు అన్నారు. కలెక్టర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 


లేదంటే శుక్రవారం ఉదయం 12 గంటలకు జిల్లా తన అనుచరులు, బీజేపీ నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. గురువారమే రఘునందన్ రావు ఈ పిలుపు ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై 300 మంది బీజేపీ కార్యకర్తలను ముందస్తుగా నిర్బంధించారు. ఈ క్రమంలోనే రఘునందన్ రావు కూడా హౌస్ అరెస్టు చేశారు.


Also Read: Hyderabad: ‘మూత్రం తాగు.. అర్ధనగ్నంగా ఉండు..’ అంటూ భర్త తీవ్రమైన వేధింపులు.. చివరికి..


కలెక్టర్ ఏం మాట్లాడారంటే..
సోమవారం (అక్టోబరు 25) జిల్లాలో జరిగిన అగ్రికల్చర్ మీటింగ్‌లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ హెచ్చరించారు. వరి విత్తనాలు అమ్మె హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టర్ వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తనాలు సరఫరా చేసే డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


Also Read: పిల్లాడు కాదు.. కామాంధుడు.. పొలాల్లోకి లాక్కెల్లి.. 21 ఏళ్ల యువతిపై అత్యాచారయత్నం


ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల‌కు సూచించారు. అలాగే ఒకవేళ ఎవరైనా వ్యాపారులు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వారి షాపులు సీజ్ చేస్తాన‌ని, భ‌విష్యత్తులో ఏ ప‌ని చేసుకోనివ్వకుండా వెంటాడ‌తాన‌ని హెచ్చరించారు. తాను క‌లెక్టర్‌గా ఉన్నంత కాలం అదే జ‌రుగుతుంద‌ని తేల్చి చెప్పారు. షాపును తిరిగి తెరవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుుల చెప్పినా తాను విననని అన్నారు. డీలర్లు కనుక ఒకవేళ విత్తనాలు అమ్మినట్లు గుర్తిస్తే ఏఈవోలు, అధికారులు సస్పెండ్ అవుతారని హెచ్చరించారు. దీంతో క‌లెక్టర్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్త చ‌ర్చ జ‌రుగుతోంది.


Also Read: Siddipet: మంత్రి హరీశ్ ఇలాకాలో కలెక్టర్ తీవ్ర వ్యాఖ్యలు.. ‘గవర్నమెంట్ బ్లాక్ మెయిల్’ అని రేవంత్ రెడ్డి ఫైర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి