ఉల్లిపాయలు కోసి కళ్లంట నీళ్లు పెట్టుకోని ఇల్లాలు ఉండదేమో. ఏ కూరగాయలు కోసినా కళ్లు మండవు, ఏడుపు రాదు. కానీ ఉల్లిపాయలు కోస్తేనే ఎందుకొస్తాయి? ఉల్లిపాయలో అల్లీన్, అల్లినెస్ అనే అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఉల్లిపాయను కోసేటప్పుడు వాటిలోని కణాలు విచ్చిన్నం అయి భాస్వరంగా మారతాయి. ఆ భాస్వర మూలకాలు విచ్ఛిన్నం అయి ప్రాపాంతియల్సో ఆక్సైడ్ అనే ద్రవంగా మారతాయి. ఆ ద్రవం అతిత్వరగా ఆవిరిగా మారి గాలిలో కలిసి కంటికి చేరుతుంది. కళ్లలో ఉండే తేమతో కలిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోజన్ సల్ఫైడ్ గా మారుతుంది. దాంతో కళ్లు ఒక్కసారిగా మండినట్టు అవుతాయి. కళ్ల నీరు కూడా కారుతుంది. ఈ ప్రభావం కొన్ని నిమిషాల పాటూ కొనసాగుతుంది. ఉల్లిపాయలు కోసేటప్పుడు మంట, కన్నీరు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి.
1. ఉల్లిపాయ కోయడానికి ముందు వాటిని ఫ్రిజ్లో కాసేపు ఉంచండి. ఆ తరువాత కోస్తే కళ్లు మంట రాదుజ మరీ ఎక్కువసేపు ఫ్రీజర్లో ఉంచితే, గట్టిపడిపోయి కోయడం కష్టమవుతుంది.
2. ఉల్లిపాయల్ని తొక్కతీసి పావుగంటసేపు నీళ్లలో నానబెట్టాలి. నీళ్లు ఉల్లిపాయల్లోని రసాయనాలను లాగేసుకుంటుంది. దీనివల్ల కళ్ల మండవు.
3. ఉల్లిపాయ కోస్తున్నప్పుడు నోటితో ఓ బ్రెడ్డు ముకుపట్టుకోండి. ఉల్లినుంచే విడుదలైన రసాయనాలు గాలి ద్వారా కళ్లను చేరకుండా ఈ బ్రెడ్డు ముక్క పీల్చేసుకుంటుంది.
4. పళ్లెంలో నీళ్లు పోసం ఆ నీళ్లలోనే ఉల్లిపాయలను ముక్కలుగా కోసుకుని, కడిగి తీసి పక్కన పెట్టుకోవడం మరో పద్దతి. ఇలా అయినా రసాయనాలను కళ్లను చేరవు.
5. కట్ చేసే చాపర్ లేదా పళ్లెం పై తడి వస్త్రం వేసి ఉల్లిపాయలను కోయాలి. ఉల్లిపాయల నుంచి వచ్చే ఆమ్లాలను ఆ తడి వస్త్రం పీల్చేసుకుంటుంది. కాకపోతే ఉల్లి కట్ చేసేప్పుడు మరీలోతుగా వస్త్రం పై ప్రభావం పట్టినట్టు కట్ చేయకూడదు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?
Also read: అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు