కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ (46) ఇకలేరు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించిందని... పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారట. పునీత్ మరణవార్తతో కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నడ ప్రేక్షకులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే... రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఇంకా పునీత్ మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదు. కర్ణాటక ముఖ్యమంత్రి అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం.


Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!


Also Read: మాస్టర్ లోహిత్ నుంచి మిస్టర్ పునీత్ వరకు....


Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన


Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి


పునీత్ రాజ్‌కుమార్‌ మరణం విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తొలుత ఆయనకు మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని ప్రచారం జరిగింది. అయితే... ఆ తర్వాత సీరియస్ అని అర్థమైంది. పునీత్ మరణవార్తను లక్ష్మీ మంచు తొలుత ట్వీట్ చేశారు. ప్రస్తుతం పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ తదితర ప్రముఖులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో ఉన్నారు.


Also Read: 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!


"ఓ మై గాడ్. నో... ఇది నిజం కాకూడదు. ఇలా ఎలా జరుగుతుంది. రాజ్ కుమార్ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. పునీత్ చాలా త్వరగా వెళ్లిపోయారు" అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు.






"హృదయం ముక్కలైంది. బ్రదర్... నిన్నెప్పుడూ మిస్ అవుతా" అని నటుడు సోనూ సూద్ ట్వీట్ చేశారు.






"హార్ట్ బ్రోకెన్ పునీత్ రాజ్ కుమార్ అన్నా... నాట్ ఫెయిర్" అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.  






కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, పార్వతమ్మ దంపతుల కుమారుడే పునీత్. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 'బెట్టాడ హువా' చిత్రానికి గాను ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నారు. హీరోగా 29 చిత్రాలు చేశారు. అభిమానులు ఆయన్ను ముద్దుగా 'అప్పు' అని పిలుస్తారు. పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ సైతం కన్నడలో ప్రముఖ హీరో. ఆయన హీరోగా నటించిన 'జై భజరంగీ' (కన్నడలో భజరంగీ 2' నేడు విడుదలైంది. ఇటీవల జరిగిన ఆ సినిమా వేడుకలో 'కె.జి.యఫ్' ఫేమ్ యష్, అన్నయ్యతో కలిసి పునీత్ డాన్స్ చేశారు.   


Also Read: వరుడు కావలెను సమీక్ష: ఈ వరుడు చాలా రొటీన్ గురూ...


Also Read: కర్ణాటకలో హైఅలర్ట్‌.. థియేటర్లు మూసేసిన ప్రభుత్వం


Also Read: పునీత్ మొదటి సినిమా తెలుగు డైరెక్టర్‌తోనే.. ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్.. తెలుగులో ఏ హీరో చేశాడంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి