దేశంలో కరోనా కేసులు మరోసారి 15 వేల కంటే దిగువనే నమోదయ్యాయి. నిన్న 16 వేల కేసులు నమోదుకాగా కొత్తగా 14,348 కేసులు వెలుగుచూశాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. కొత్తగా 805 మంది మృతి చెందారు. 13,198 మంది కరోనా నుంచి రికవరయ్యారు.






యాక్టివ్ కేసుల సంఖ్య 1,61,334కి చేరింది. రికవరీ రేటు 98.20%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. మరోవైపు వ్యాక్సిన్ డోసుల పంపిణీ 105 కోట్లకు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.






కేరళ..


కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 9,445 మందికి కరోనా సోకగా 622 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 49,29,397కు చేరగా మొత్తం మరణాల సంఖ్య 29,977కు పెరిగింది.


మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 1,517 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో తిరువనంతపురం (1,284), కోజికోడ్ (961), త్రిస్సూర్ (952) ఉన్నాయి.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 1,418 కేసులు నమోదయ్యాయి. 36 మంది కరోనాతో మరణించారు. 


Also Read: G20 Summit 2021: రోమ్ చేరుకున్న ప్రధాని.. జీ20, కాప్- 26 సదస్సులతో మోదీ బిజీ


Also read:  అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే