జీ20 సదస్సు, కాప్-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే రోమ్ చేరుకున్న మోదీ.. ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, కరోనా సంక్షోభం అనంతరం వైద్య రంగం పరిస్థితులపై గ్లాస్‌గౌలో జరగనున్న సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.
ఇదే షెడ్యూల్..
ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ఆహ్వనం మేరకు రోమ్, వాటికన్ సిటీలో అక్టోబర్ 29-31 వరకు ప్రధాని మోదీ పర్యటిస్తారు. అనంతరం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు గ్లాస్గో నగరాన్ని సందర్శించనున్నారు.
నిన్న రాత్రి దిల్లీ నుంచి ప్రధాని మోదీ ఇటలీ బయలుదేరిన సమయంలో ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ట్వీట్ చేసింది.
ఇటలీ పర్యటనలో భాగంగా వాటికన్ సిటీని సందర్శించనున్న ప్రధాని మోదీ.. అక్కడ పోప్ ఫ్రాన్సిస్‌ను కలవనున్నట్లు సమాచారం.
అక్టోబర్ 30-31 తేదీల్లో జీ20 సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగితో ద్వైపాక్షిక భేటీ కూడా ఉంది. జీ20 సమావేశం అనంతరం గ్లాస్గోలో జరగనున్న కాప్26 వరల్డ్ లీడర్స్ సమిట్‌లోనూ మోదీ పాల్గొంటారు.
Also read: అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు