చిన్నవయసులో శరీరం చురుకుగా ఉంటుంది. కండరాలు, కీళ్లు చక్కగా కదులుతాయి. కూర్చోవడం, నిల్చోవడం, పరుగెత్తడం... ఇవన్నీ సులువుగా చేయగలం. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం వేగంగా కదిలేందుకు సహకరించదు. కండరాలు, కీళ్లు పట్టేస్తుంటాయి. నలభై ఏళ్లు దాటే వాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. యాభై ఏళ్లు దాటిన వాళ్ల పరిస్థితి మరీ అధ్వానం. కుర్చీలో కూర్చొని కొంతమంది లేవలేరు. ఏదో ఒక ఆధారం పట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ముఖ్యమైన సూచిక అని అంటున్నారు బ్రెజిల్ డాక్టర్ క్లాడియో గిల్ అరుజో. ఆయన ఒక చిన్న టెస్టును కనిపెట్టారు. ఆ టెస్టు ద్వారా ఒక వ్యక్తి వచ్చే అయిదేళ్లలో ఆరోగ్యంగా జీవించబోతున్నాడా లేదా కనిపెట్టెయచ్చని చెబుతున్నాడు. అంతేకాదు వచ్చే అయిదేళ్లలో ఆ వ్యక్తి మరణించే అవకాశాలు ఎంతున్నాయో కూడా చెప్పేయవచ్చని అంటున్నాడు. తాను కనిపెట్టిన ఈ టెస్టుకు ‘ద సిట్టింగ్ - రైజింగ్ టెస్ట్’ అని పేరు పెట్టాడు. అంటే ‘కూర్చొని - నిల్చునే పరీక్ష’ అన్నమాట. ఇప్పటికే పలు ప్రయోగాల ద్వారా టెస్ట్ ఫలితం నిజమేనని నిరూపించాడు.
ముఖ్యమైన పని అదే
పాశ్చాత్య దేశాల్లో ఈ మధ్యకాలంలో చాలా మంది వైద్యులు కింద కూర్చుని నిల్చునే పరీక్ష చేసుకోమని ప్రజలకు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ పనికి తగిన స్థాయిలో కండరాల బలం, అన్ని కండరాల సమన్వయం, సమతుల్యత ఇవన్నీ అవసరం అవుతాయి. మీరు ఎంత ఫిట్ గా ఉన్నారో ఈ టెస్టు చెప్పేస్తుంది. ఈ పరీక్ష మోకాలినొప్పులు, ఆర్ధరైటిస్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కాదు. వారు ఈ పరీక్షలో సరైన ఫలితాన్ని పొందలేకపోవచ్చు. వీడియో చూసి మీరు కూడా టెస్టు చేసుకోండి మీ స్టామినా ఎంతో.
టెస్టు ఇలా...
కాళ్లు క్రాస్ గా పెట్టి కింద కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఎలాంటి సపోర్ట్ తీసుకోకూడదు. కూర్చున్నాక మళ్లీ అలాగే పైకి లేవాలి. లేచినప్పుడు కూడా ఎలాంటి సపోర్ట్ తీసుకోకూడదు. అంటే చేయి నేలకి తాకించి లేవడం, ఒక మోకాలు కిందకి ఆనించి సపోర్ట్ తీసుకుని లేవడం చేయకూడదు. ఇలా ఎలాంటి సపోర్ట్ లేకుండా మీరు కూర్చుని లేవగలిస్తే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్టే. వచ్చే అయిదేళ్లలో కూడా మీరు శారీరకంగా స్ట్రాంగ్ గానే ఉంటారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: రోజుకో గ్లాసు గంజినీళ్లతో మెరిసే అందమే కాదు, చక్కటి ఆరోగ్యమూ సొంతమవుతుంది
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు
Also read: ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఖాతాలు తొలగించాక... ఏకంగా 31 కిలోలు తగ్గిందట ఈ అమ్మడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి