హైదరాబాద్ నగరంలో పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. ఏపీలోని వైఎస్సార్ కడప పట్టణానికి చెందిన చక్కటి సి. నర్సింహులు అనే 38 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా ఆయన ఉప్పల్ ప్రాంతంలో తల్లి ఓబులమ్మ, సోదరుడితో కలసి ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు.
ఇతను హిమాయత్ నగర్‌లోని శ్రీబాలాజీ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఓ ల్యాబ్ టెక్నీషియన్‌గా నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వీరి తండ్రి వీరికి దక్కాల్సిన ఆస్తి ఇవ్వకపోగా.. పట్టించుకోకపోవంతో చివరికి తీవ్రమైన అప్పులు మిగిలాయి. నర్సింహులు అన్నకు కూడా పెళ్లి కాలేదు. కొద్దిరోజులుగా నర్సింహులుకు వివాహ సంబంధాలు చూస్తున్నా ఏవీ కుదరడం లేదు. దీంతో ఆ యువకుడు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు.
Also Read: Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?
వారి కుటుంబం చేసిన అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి నెలకొంది. తన బాధలను తల్లికి, అన్నకు చెప్పుకోలేక తాను పనిచేస్తున్న చోటే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి తన తల్లికి ఫోన్ చేసిన నర్సింహులు పని ఎక్కువగా ఉందని, ఇక్కడే పడుకుని తెల్లారిన తర్వాత వస్తానని చెప్పాడు. సెంటర్‌లో పనిచేసే వారంతా వెళ్లి పోయిన తర్వాత గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బుధవారం ఉదయం డ్యూటీకి వచ్చిన వారు రూమ్ తలుపులు బద్దలు కొట్టి చూడగా నర్సింహులు చనిపోయి పడి ఉన్నాడు. దీంతో వారు పోలీసులకు, సెంటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also Read: Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జిషీట్ .. కాపీ కావాలని కోర్టులో సునీత పిటిషన్ !
Also Read: Murder Case: ఆత్మహత్య కాదు.. హత్యే.. రాత్రి వొడ్కా తాగి.. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి.. ఆపై..
Also Read: ఆత్మహత్య కాదు.. హత్యే.. రాత్రి వొడ్కా తాగి.. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి.. ఆపై..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి