కొద్ది రోజులుగా ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు కూడా కొన్ని నగరాల్లో వ్యత్యాసం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో నేడు ఇంధన ధరలు పెరిగాయి. నగరంలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.36 పైసలు పెరిగి రూ.112.27గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.38 పైసలు పెరిగి రూ.105.46గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.34 పైసలు పెరిగి రూ.111.79 అయింది. డీజిల్ ధర రూ.0.36 పైసలు పెరిగి రూ.105.00 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.05 పైసలు పెరిగి.. రూ.112.44గా ఉంది. డీజిల్ ధర రూ.0.09 పైసలు పెరిగి రూ.105.61 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.36 పైసలు పెరిగి రూ.114.05 గా ఉంది. డీజిల్ ధర రూ.0.38 పైసలు పెరిగి రూ.107.11 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా పెరిగాయి. ప్రస్తుతం రూ.114.28 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.20 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.14 పైసలు పెరిగి రూ.106.86కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.


విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.113.18గా ఉంది. గత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.52 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.105.78గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.40 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


తిరుపతిలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.1.41 పైసలు పెరిగి.. రూ.116.09 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.108.45గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.1.32 పైసలు పెరిగింది. క్రమంగా పెరుగుతూ వస్తున్న ముడిచమురు ధరలే ఇంధన ధరలు ఎగబాకేందుకు కారణంగా తెలుస్తోంది.


ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 28 నాటి ధరల ప్రకారం 81.21 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


Also Read: Ola Electric Scooter: అమ్మకాల్లో ఓలా స్కూటర్ రికార్డు.. మొత్తం టూవీలర్ ఇండస్ట్రీనే మించేలా.. ఎన్ని అమ్ముడుపోయాయంటే?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి