కొత్త బైక్ కొనేటప్పుడు మనం చూసే మొట్టమొదటి అంశం బడ్జెట్. రూ.లక్షలోపు బైక్‌లకు మనదేశంలో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. దీంతోపాటు ఇప్పుడు రూ.75 వేల నుంచి రూ.లక్ష మధ్యలో చాలా బైకులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని స్పోర్ట్స్ తరహా మోడళ్లు కూడా ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఆప్షన్లు ఇవే..


1. హోండా లివో డిస్క్
ఈ లిస్ట్‌లో అత్యంత చవకైన బైక్ ఇదే. 110 సీసీ బైకుల్లో దేశంలోనే అత్యంత ఖరీదైన బైక్ ఇదే. హోండా లివోలో 4 స్ట్రోక్ పవర్ ఇంజిన్ అందించారు. దీని మైలేజ్ లీటరుకు 65 కిలోమీటర్లుగా ఉంది. 4-స్పీడ్ గేర్ బాక్స్‌ను కూడా ఇందులో అందించారు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 9 లీటర్లుగా ఉంది.


ధర: రూ.75,681(ఎక్స్-షోరూం, ఢిల్లీ)


2. హీరో సూపర్ స్ప్లెండర్ డిస్క్
ఇది ఒక సింపుల్ కమ్యూటర్ బైక్. ఇందులో 125 సీసీ ఇంజిన్‌ను అందించారు. ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్‌ను ఇందులో అందించారు. 5-స్పీడ్ గేర్ బాక్స్‌ను ఇందులో అందించారు. దీని కెర్బ్ వెయిట్ 122 కేజీలు మాత్రమే. ఒక లీటరు పెట్రోలుకు 55 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్‌ను ఈ బైక్ అందించనుంది. దీని ఫ్యూయల్ టాంక్ కెపాసిటీ 12 లీటర్లుగా ఉంది.


ధర: రూ.75,900(ఎక్స్-షోరూం, ఢిల్లీ)


3. హోండా షైన్ 125 సీసీ డిస్క్
ఇందులో 124 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇందులో కూడా ఫైవ్-స్పీడ్ గేర్ బాక్సే అందుబాటులో ఉంది. దీని మైలేజ్ లీటరుకు 55 కిలోమీటర్లు కాగా, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 10.5 లీటర్లుగా ఉంది. బైక్ బరువు 114 కేజీలుగా ఉంది.


ధర: రూ.77,582(ఎక్స్-షోరూం, ఢిల్లీ)


4. హోండా ఎస్పీ 125 డిస్క్
ఇది హోండా షైన్ 125లో ప్రీమియం వెర్షన్. యువకుల కోసం ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేశారు. ఇందులో ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ క్లస్టర్‌ను అందించారు. దీని ఇంజిన్ సామర్థ్యం 124 సీసీగా ఉంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇందులో అందించారు. లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇది అందించనుంది. దీని ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లు కాగా, బరువు 117 కేజీలుగా ఉంది. 


ధర: రూ.82,677(ఎక్స్-షోరూం, ఢిల్లీ)


5. హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ డిస్క్
రైడర్, పల్సర్ తరహాలో కాకుండా గ్లామర్ కమ్యూటర్ మోటార్ సైకిల్ అని చెప్పవచ్చు. దీని ఇంజిన్ సామర్థ్యం 124.7 సీసీగా ఉంది. లీటరుకు 55 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇది అందించనుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లుగా ఉంది. దీని బరువు 122 కేజీలుగా ఉంది.


ధర: రూ.83,500(ఎక్స్-షోరూం, ఢిల్లీ)


6. టీవీఎస్ రైడర్ డిస్క్
లేటెస్ట్‌గా లాంచ్ అయిన ఈ టీవీఎస్ రైడర్ బైక్ కొన్ని అంశాల్లో మిగిలిన 125 సీసీ బైకుల కంటే ముందే ఉందని చెప్పాలి. దీని ఇంజిన్ సామర్థ్యం 124.8 సీసీగా ఉంది. స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఐదు అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఇందులో ఉంది. ఈ బైక్ లీటరుకు 67 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు కాగా, బరువు 123 కేజీలుగా ఉంది.


ధర: రూ.85,469(ఎక్స్-షోరూం, ఢిల్లీ)


7. బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్
భారతదేశ యువతలో మంచి క్రేజ్ ఉన్న బైకుల్లో పల్సర్ కూడా ముందంజలో ఉంటుంది. ఇందులో 125 సీసీ వేరియంట్ బైకులు నెలకు 20 వేల వరకు అమ్ముడుపోతూ ఉంటాయి. చూడటానికి కూడా స్పోర్ట్స్ లుక్‌తో ఈ బుక్ ఉంటుంది. ఇందులో ఫైవ్-స్పీడ్ గేర్ బాక్స్‌ను అందించారు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లుగా ఉండటం విశేషం. లీటరుకు 52 కిలోమీటర్ల మైలేజ్‌ను ఈ బైక్ అందించనుంది. దీని బరువు 140 కేజీలుగా ఉంది.


ధర: రూ.87,469(ఎక్స్-షోరూం, ఢిల్లీ)


8. రివోల్ట్ ఆర్వీ400
ఈ జాబితాలో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ బైక్ ఇదే. ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్‌ను ఇందులో అందించారు. దీని బరువు కేవలం 108 కేజీలు మాత్రమే. వెనకవైపు, ముందువైపు డిస్క్ బ్రేకులు ఇందులో అందుబాటులో ఉండటం విశేషం.


ధర: రూ.90,799(ఎక్స్-షోరూం, ఢిల్లీ)


9. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125
125 సీసీ రేంజ్‌లో బజాజ్ దగ్గరున్న రెండో స్పోర్ట్స్ బైక్ ఇదే. బజాజ్ ఎన్ఎస్ సిరీస్‌లో మొత్తంగా మూడు బైకులు ఉన్నాయి. అవే ఎన్200, ఎన్ఎస్160, ఎన్ఎస్125. దీని బరువు 144 కేజీలుగా ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు కాగా, లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.


ధర: రూ.98,234(ఎక్స్-షోరూం, ఢిల్లీ)


10. బజాజ్ పల్సర్ 150
రూ.లక్షలోపు అందుబాటులో ఉన్న రెండు 150 సీసీ బైకుల్లో ఇది కూడా ఒకటి. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే 150 సీసీ బైకుల్లో ఇది కూడా ఒకటి. హోండా యునికార్న్ 160 నుంచి ఈ బైక్ గట్టిపోటీని ఎదుర్కుంటోంది. ఇందులో 149.5సీసీ ఇంజిన్‌ను అందించారు. దీని బరువు 144 కేజీలుగా ఉంది. లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లుగా ఉంది.


ధర: రూ.98,291(ఎక్స్-షోరూం, ఢిల్లీ)


11. హోండా యునికార్న్ 160
ఇందులో 162.7 సీసీ ఇంజిన్‌ను అందించారు. ఇది బజాజ్ పల్సర్‌కు గట్టిపోటీని ఇస్తుంది. ఈ బైక్ బరువు 140 కేజీలుగా ఉంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు కాగా, లీటరుకు 53 కిలోమీటర్ల మైలేజ్‌ను ఈ బైక్ అందించనుంది.


ధర:  రూ.98,931(ఎక్స్-షోరూం, ఢిల్లీ)


Also Read: Ola Electric Scooter: అమ్మకాల్లో ఓలా స్కూటర్ రికార్డు.. మొత్తం టూవీలర్ ఇండస్ట్రీనే మించేలా.. ఎన్ని అమ్ముడుపోయాయంటే?


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


Also Read: 2021 Kia Carnival: కియా కార్నివాల్ కొత్త వేరియంట్లు వచ్చేశాయ్.. ప్రీమియం ఫీచర్లు.. కంఫర్ట్ సూపర్!