సోషల్ లైఫ్ అంటే అర్థం మారిపోయింది. సోషల్ మీడియా ఖాతాల్లో బతకడమే సోషల్ లైఫ్. అంతకుముందు అందరూ కలిసి, ఒకచోట చేరి సంతోషంగా బతకడాన్ని సోషల్ లైఫ్ గా భావించేవాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టడం, చాట్ చేయడమే సామాజిక జీవితమైపోయింది. ఇలా చాలా మంది సోషల్ మీడియాలోనే గంటలుగంటలు గడిపేస్తున్నారు. అలా తెలియకుండానే ఎన్నో ఆరోగ్యసమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ అమ్మాయి తన సోషల్ మీడియా ఖాతాలను తొలగించి, కెలోరీలు తగ్గించుకుని నాజుకుగా మారింది. ఖాతాలను తొలగించాక ఏకంగా 31 కిలోలు బరువు తగ్గానని చెబుతోంది. ఆమె పేరు బ్రెండా, నివసించేది లండన్లో. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు తొలగిస్తే, బరువు ఎలా తగ్గుతారు అన్న అనుమానం వచ్చిందా? అయితే చదవండి...
బ్రెండా లావుగా ఉండేది. ఎన్ని డైట్లు పాటించినా బరువు తగ్గలేదు. వైద్యులను కూడా కలిసింది అయినా ఫలితం లేదు. ఎన్ని టెక్నిక్స్ పాటించినా బరువు మాత్రం తగ్గలేకపోయింది. ఓసారి మొబైల్ నుంచి ఫేస్ బుక్, ఇన్ స్టా రెండు యాప్ లను తొలగించింది. తన ఖాతాలను ఇనాక్టివ్ చేసింది. పూర్తిగా వాటి సంగతే మర్చిపోయింది. ఇలా ఏడాది వాటికి దూరంగా ఉంది. ఆ ఏడాదిలో ఆమె 31 కిలోలు తగ్గింది. ఎలాగో తెలుసా? సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని పూర్తిగా ఫిట్నెస్ పై ఖర్చుపెట్టింది. జిమ్ లో వ్యాయామాలు చేయడం, నడక వంటివి పాటించేది. దీంతో ఊహించని విధంగా బరువు తగ్గి సన్నని మెరుపుతీగలా మారింది. అందుకే తన కథను అందరితో పంచుకుంది.
ఆ పోస్టులు చూస్తే మరీను...
బ్రెండా చెప్పిన ప్రకారం 2016 నుంచి 2019 మధ్య ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం వల్ల భారీగా బరువు పెరిగింది. గతేడాది లాక్ డౌన్ లో మరిన్ని కిలోలు పెరిగింది. దానికి సోషల్ మీడియానే కారణమని అర్థం చేసుకుంది బ్రెండా. ఇన్ స్టా, ఫేస్ బుక్ చూసుకుంటూ తాను నాలుగైదు గంటలు కూర్చునే ఉండిపోయేదట. అంతేకాదు ఆరోగ్యానికి, అందానికి సంబంధించిన పోస్టులు చూసినప్పుడల్లా చాలా డిప్రెస్ గా ఫీలయ్యేదట.అందుకే ఆ ఖాతాలు లేకపోతే మంచిదని భావించింది. అలా తొలగించిన కొన్ని నెలలకే దుస్తులు వదులైనట్టు అనిపించాయి బ్రెండాకి. కేవలం ఏడాదిలోనే బరువులో మూడో వంతు తగ్గినట్టు గుర్తించింది. తన సమయాన్ని వృథా చేయకుండా జాగింగ్ కు వెళ్ళడం, ఆరోగ్యకరమైన వంటలు వండుకోవడం వంటి పనులతో గడుపుతోంది. ఇంతకుముందు కన్నా జీవితం చాలా ఆనందంగా ఉందని చెబుతోంది బ్రెండా. ఇదంతా సోషల్ మీడియా ఖాతాలు తొలగించడం వల్లే అంటోంది.
Also read: ఒత్తయిన జుట్టు కావాలా... ఈ మూడూ తినండి చాలు
Also read: రోజూ తాగుతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ
Also read: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి
Also read: డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి