కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుకు గురయ్యారు. జిమ్ చేస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో ఆయన్ను హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అనుభవజ్ఞులైన వైద్యుల సమక్షంలో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆయన మరణించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందువల్ల... అభిమానులు, ప్రేక్షకులు ఆందోళనకు గురవుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ వయసు 46 సంవత్సరాలే. ఓ గంట తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!
పునీత్ రాజ్ కుమార్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిన వెంటనే... ఆయన్ను పరామర్శించడానికి ఆస్పత్రికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ వెళ్లారు. ఇంకా పలువురు కన్నడ హీరోలు, ప్రముఖులు ఆస్పత్రికి తరలి వెళ్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఆస్పత్రి దగ్గరకు చేరుకుంటుంన్నారు. ఇప్పటికే చాలామంది అభిమానులు ఆస్పత్రికి వచ్చారు.
Also Read: 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, పార్వతమ్మ దంపతుల కుమారుడే పునీత్. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 'బెట్టాడ హువా' చిత్రానికి గాను ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నారు. హీరోగా 29 చిత్రాలు చేశారు. అభిమానులు ఆయన్ను ముద్దుగా 'అప్పు' అని పిలుస్తారు. పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ సైతం కన్నడలో ప్రముఖ హీరో. ఆయన హీరోగా నటించిన 'జై భజరంగీ' (కన్నడలో భజరంగీ 2' నేడు విడుదలైంది. ఇటీవల జరిగిన ఆ సినిమా వేడుకలో 'కె.జి.యఫ్' ఫేమ్ యష్, అన్నయ్యతో కలిసి పునీత్ డాన్స్ చేశారు.
Also Read: సామి... సామి... సాంగ్ వచ్చిందిరా సామి!
Also Read: ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడుతున్న వారెవరంటే..?
Also Read: సిస్టర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. రజినీకాంత్ మాస్ అవతార్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి