ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్‌ సెనెట్‌లో జరిగిన యాంబిషన్ ఇండియా 2021 కార్యక్రమంలో ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. 



Also Read : ‘కేటీఆర్ సర్.. ఇది న్యాయమా? అంత ఒత్తిడి దేనికి?’ మంత్రికి యాంకర్ అనసూయ ట్వీట్


పారిశ్రమికవేత్తలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు పారిస్‌లో వివిధ గ్లోబల్ సీఈఓలతో పెట్టుబడులపై చర్చలు జరిపారు. పారిస్‌లో పారిశ్రామిక వేత్తల సంఘం అయిన "  మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్" డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో కేటీఆర్ బృందం సమావేశం అయింది. తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను వివరించారు. 



Also Read : అనుమతులు వచ్చాకే పాలమూరు - రంగారెడ్డి నిర్మాణం .. తెలంగాణ సర్కార్‌ను ఆదేశించిన ఎన్జీటీ !


 " మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్"  ఫ్రాన్స్‌లో ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఫెడరేషన్.  ఫ్రాన్స్‌లో 95శాతం కన్నా ఎక్కువ వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సమూహాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఇటీవల సాధించిన విజయాలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వారికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అనేక అవకాశాలను కల్పిస్తున్నాయని వివరించారు.






Also Read : మంత్రులకు జీహెచ్ఎంసీ షాక్... టీఆర్ఎస్ ఫ్లెక్సీలకు భారీగా జరిమానాలు...


ప్యారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు.  స్టేషన్ ఎఫ్ బృందంతో సమావేశం అయ్యారు. టీ హబ్, వుయ్ హబ్, టీ వర్క్స్, తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ సంస్థలతో కలిసి పని చేసే అంశంపై చర్చించారు.  స్టేషన్ ఎఫ్ ప్యారిస్ నడిబొడ్డున ఉన్న ఒక ప్రత్యేకమైన క్యాంపస్ . ఇందులో 1,000 స్టార్టప్‌లు ఉన్నాయి.  రైల్వే డిపోగా ఉండే దాన్ని ప్రత్యేకంగా స్టార్టప్‌ల కోసం ప్రభుత్వం ఇంక్యూబేటర్‌గా మార్చింది. 






Also Read: అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !


ప్రఖ్యాత మల్టినేషనల్ కంపెనీ ఏడీపీ చైర్మన్, సీఈవోలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఏడీపీ ఇటీవల హైదరాబాద్‌ భారీగా పెట్టుబడులు పెట్టింది.  ఏరో స్పేస్ రంగంలో ఏడీపీ పెట్టుబడలు పెడుతోంది. ప్రధాన ప్రపంచ ఏరోస్పేస్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని మంత్రి ఏడీపీ యాజమాన్యానికి తెలిపారు. ఏరోస్పేస్ రంగానికి నాణ్యమైన సిబ్బందికి శిక్షణ ఇచ్చి సరఫరా చేయాల్సిన అవసరాన్ని కేటీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. మంత్రి కేటీఆర్ పారిస్‌లో సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్‌ను కూడా కలిశారు.   సనోఫీ త్వరలో తన హైదరాబాద్ క్యాంపస్ నుంచి సిక్స్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుంది.


Also Read: Siddipet: మంత్రి హరీశ్ ఇలాకాలో కలెక్టర్ తీవ్ర వ్యాఖ్యలు.. ‘గవర్నమెంట్ బ్లాక్ మెయిల్’ అని రేవంత్ రెడ్డి ఫైర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి