అన్వేషించండి

Womens Health: మహిళలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు మానకూడదు? డాక్టర్లు చెప్పిన 5 సమస్యలు ఇవే

Never Skip Breakfast | ఉదయం పూట తినే బ్రేక్ ఫాస్ట్ మహిళలకు బ్లడ్ షుగర్‌ను సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువ గంటలు ఖాళీ కడుపుతో ఉండటం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బ్రేక్‌ఫాస్ట్ మానడం రక్తంలో చక్కెర స్థాయులను అస్థిరం చేస్తుంది.
  • హార్మోన్ల అసమతుల్యత పెరిగి, పీసీఓఎస్ వంటి సమస్యలు తీవ్రమవుతాయి.
  • శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు అందక లోపం ఏర్పడుతుంది.
  • ఆకలి నియంత్రణ హార్మోన్లు ప్రభావితమై, బరువు పెరిగే ప్రమాదం.

Womens Health: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజులో మనం తీసుకునే వాటిలో అత్యంత ముఖ్యమైన ఆహారం. కానీ నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తినడం లేదు. ఒక్కోసారి సమయం లేకపోవడం వల్ల, మరికొన్ని సార్లు బరువు తగ్గాలనే ప్రయత్నంలో మహిళలు బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారు. అయితే, సుదీర్ఘ కాలం పాటు బ్రేక్‌ఫాస్ట్‌ను మానడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే, దాని ప్రభావం కేవలం శక్తిపైనే కాకుండా జీర్ణక్రియ,  హార్మోనల్ హెల్త్, మొత్తం ఆరోగ్యంపై కూడా పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బ్లడ్ షుగర్‌లో హెచ్చుతగ్గులు 

మెడికల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. మహిళలకు ఉదయం పూట తినే ఆహారం బ్లడ్ షుగర్‌ను బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండటం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు అస్థిరంగా ఉంటాయి. దీని ప్రభావం వల్ల పగటిపూట స్వీట్లు లేదా జంక్ ఫుడ్ తినాలనే కోరిక మరింత పెరగవచ్చు. ఇలా రెగ్యూలర్‌గా జరగడం వల్ల బరువు పెరగడంతో పాటు భవిష్యత్తులో డయాబెటిస్ (మధుమేహం) వచ్చే ప్రమాదం పెరగవచ్చు.

హార్మోన్లకు సంబంధించిన సమస్యలు 

ముందే పీసీఓఎస్ (PCOS), థైరాయిడ్ లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలు ఉన్న మహిళలు ప్రతిరోజూ ఓకే సమయంలో ఆహారం తీసుకోవడం మరింత అవసరమని డాక్టర్లు సూచించారు. పదే పదే బ్రేక్‌ఫాస్ట్ మానడం వల్ల శరీరంపై అదనపు ఒత్తిడి పడి, హార్మోన్ల అసమతుల్యత పెరగడం, గతంలో ఉన్న సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. 

Also Read: Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!

అవసరమైన పోషకాల లోపం ఏర్పడుతుంది

బ్రేక్‌ఫాస్ట్ కేవలం కడుపు నింపుకోవడం మాత్రమే కాదు. రోజు మొత్తానికి అవసరమైన పోషకాలను తీసుకునే సరైన సమయం. ఉదయం పూట ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, అనేక రకాల విటమిన్లను చేర్చుకోవాలి. మహిళలు క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ మానేస్తూ, మిగిలిన సమయంలోనూ మంచి ఆహారం తీసుకోకపోతే పోషకాల లోపం ఏర్పడవచ్చు.

ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావితం

ఉదయం ఆహారం మానడం వల్ల ఆకలిని కంట్రోల్ చేసే శరీరంలోని హార్మోన్లు ప్రభావితం అవుతాయి. దీని ఫలితంగా ఆ తర్వాత పగటి సమయంలో ఎక్కువ ఆకలి వేసి, తక్కువ సమయంలోనే అవసరానికి మించి ఆహారం తీసుకుంటారు. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుంది. 

ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన సమస్యలు రావు

ప్రతి వ్యక్తి శారీరక అవసరాలు, శరీరతత్వం వేర్వేరుగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. కొందరు మహిళలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పద్ధతులను పాటిస్తూ, రోజులో తమకు కావలసిన అవసరమైన పోషకాలను తీసుకుంటారు. కనుక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు తగినంత పరిమాణంలో అందడానికి బ్రేక్‌ఫాస్ట్ కీలకం కానుంది. అది స్కిప్ చేస్తే మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని గుర్తుంచుకోండి.

Also Read: House Cleaning Tips: ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్

Frequently Asked Questions

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల ఏమవుతుంది?

బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇది శక్తి, జీర్ణక్రియ, హార్మోన్ల ఆరోగ్యం మరియు మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బ్లడ్ షుగర్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఉదయం ఆహారం మానడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు అస్థిరంగా మారి, స్వీట్లు తినాలనే కోరిక పెరుగుతుంది. దీని వల్ల బరువు పెరిగి, డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

బ్రేక్‌ఫాస్ట్ మానడం వల్ల హార్మోన్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి, హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది పీసీఓఎస్, థైరాయిడ్ వంటి సమస్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు.

బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు ముఖ్యమైన పోషకాల వనరు?

బ్రేక్‌ఫాస్ట్ రోజు మొత్తానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్‌లను అందిస్తుంది. దీన్ని మానేయడం వల్ల పోషకాల లోపం ఏర్పడవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget