US on Pfizer Vaccine: పైజర్ టీకాకు అమెరికా పూర్తి స్థాయి అనుమతులు
కరోనా నివారణకు ఫైజర్ బయోటెక్నాలజీ సంస్థ తయారు చేసిన టీకాకు అమెరికా ఎఫ్ డీఏ పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది.
ఫైజర్ బయోటెక్నాలజీ సంస్థ తయారు చేసిన కరోనా టీకాకు అమెరికాలో పూర్తి స్థాయి అనుమతులు లభించాయి. ఈ మేరకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ప్రకటన జారీ చేసింది. ఇప్పటివరకు అత్యవసర వినియోగం కోసం ఈ టీకాను పంపిణీ చేస్తున్నారు. తాజాగా పూర్తి స్థాయి అనుమతులు లభించాయి. ఈ అనుమతులతో ఫైజర్ వ్యాక్సిన్ 16 ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వొచ్చు. టీకాపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగా ఎఫ్ డీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
US FDA grants Pfizer Covid vaccine full approval for people aged 16 and older: AFP
— ANI (@ANI) August 23, 2021
ప్రపంచంలో పూర్తిస్థాయి అనుమతులు లభించిన తొలి వ్యాక్సిన్ ఇదే. ఇక నుంచి ఈ టీకాను దాని బ్రాండ్ నేమ్ అయిన 'కమిర్నటి' పేరుతో విక్రయించే వీలుంటుంది. అత్యవసర వినియోగ అనుమతులతో 12-15 ఏళ్ల వయసు వారికి టీకా ఇవ్వనున్నారు.
Today, FDA approved the first COVID-19 vaccine for the prevention of #COVID19 disease in individuals 16 years of age and older. https://t.co/iOqsxXV1fj
— U.S. FDA (@US_FDA) August 23, 2021
“The FDA’s approval of this vaccine is a milestone as we continue to battle the #COVID19 pandemic.” – Acting FDA Commissioner @DrWoodcockFDA
— U.S. FDA (@US_FDA) August 23, 2021
రెండు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వివిధ రకాల కరోనా వైరస్‌లకు వ్యతిరేకంగా శక్తిమంతమైన రోగనిరోధక స్పందన కనిపిస్తున్నట్టు ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. టుక్రూ, హెల్సింకీ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. అయితే కొమిర్నాటి బ్రాండ్ పేరుతో విక్రయించే ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ కరోనాపై మరింత సమర్థంగా పనిచేయడానికి మూడో డోస్ అవసరమని ఇటీవల సంస్థ తెలిపింది.
దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించిన బీటా వేరియంట్, భారత్‌లో కనిపించిన డెల్టా వేరియంట్‌లకు వ్యతిరేకంగా.. ఫైజర్ వ్యాక్సిన్ మూడో డోసు తీసుకోవడం వల్ల మంచి రక్షణ లభిస్తుందని కంపెనీ భావిస్తోంది. టీకాలు వేసిన ఆరు నుంచి 12 నెలల్లోపు మూడో డోసు అవసరమవుతుందని ఫైజర్ తెలిపింది.
Also Read: Fact check: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలపై కేంద్రం ఒప్పందం... ఫేక్ మేసేజ్ పై పీఐబీ క్లారిటీ