అన్వేషించండి

చర్మంపై దురద, దద్దుర్లు వస్తున్నాయా? ఆ దీర్ఘకాలిక వ్యాధికి సంకేతం కావచ్చు

చర్మంపై దద్దుర్లు, దురద సాధారణంగా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అది మూత్రపిండాల వ్యాధికి కూడా సంకేతం అని చెబుతున్నారు వైద్యులు.

వాతావరణంలో కాలుష్యం కారణంగా లేదా తిన్న ఆహారం పడకపోయినా కూడా చర్మంపై చిన్న దద్దుర్లు వచ్చి దురద పెడతాయి. ఇది కాసేపటికి పోతుంది. అలా పోకుండా ఎక్కువకాలం వేధిస్తూ ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే చర్మంపై దురద, అసాధారణంగా కనిపించే దద్దుర్లు మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావచ్చు. మూత్రపిండాల వ్యాధులు కొన్నిసార్లు చర్మంపై దురద, దద్దుర్ల రూపంలో లక్షణాన్ని చూపించవచ్చు. కాబట్టి ఇలాంటి చర్మ సమస్యలు వేధిస్తున్న వైద్యులను సంప్రదించడం అన్ని విధాలా మంచిది. 

మూత్రపిండాల వ్యాధి బారిన పడిన వ్యక్తి చర్మంపై దద్దుర్లు వచ్చి పొడిబారిపోతుంది. దురద కూడా ఎక్కువగా పెడుతుంది. ఇలా కావడానికి కారణం శరీరంలో మూత్రస్థాయిలు ఎక్కువగా ఉండడం. డయాలసిస్ పై ఉన్న రోగులు తరచూ తమకు చర్మంపై దురద కలుగుతున్నట్టు ఫిర్యాదు చేస్తూ ఉంటారు.  వైద్యులు చెబుతున్న ప్రకారం రోగికి కారణం లేకుండా చర్మం పై దద్దుర్లు, దురద వస్తూ ఉంటే మూత్రపిండ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. బయటికి కనిపించకపోయినా ఆ చర్మ సమస్యకు అంతర్లీనంగా దీర్ఘకాలిక మూత్రపిండవ్యాధి తప్ప మరొకటి కారణం అయ్యే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు. 

చికిత్స
మూత్రపిండాల వ్యాధి కారణంగా ఇలాంటి చర్మ సమస్యలు మొదలైతే వాటికి చికిత్స చేయడం కొంత కష్టమే. ఎందుకంటే అంతర్లీనంగా ఉన్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి చికిత్స చేసి దాన్ని నయం చేస్తే తప్ప ఈ చర్మ సమస్యలు రావడం తగ్గదు. కిడ్నీ ఆరోగ్యం మెరుగైతే చర్మం కూడా తదనగుణంగా దురదను దద్దుర్లను తగ్గించుకుంటుంది. లేకుంటే ఎలాంటి క్రీములు రాసినా కూడా ఫలితం ఉండదు. 

ఏం తినాలి?
మీకు చర్మంపై దద్దుర్లు, దురద వేధిస్తూ ఉన్నప్పుడు ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి. ఎందుకంటే ఆ చర్మం పై వచ్చిన సమస్యలు సాధారణంగా వచ్చినవో లేక మూత్రపిండాల వ్యాధి కారణంగా వచ్చినవో తెలియదు. ఒకవేళ మూత్రపిండాల వ్యాధి కారణంగా వచ్చినవే అయితే ఉప్పు తీసుకోవడం ప్రమాదకరం. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్లు తినడం మానేయాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉంటే, అవి వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా ఎంచుకోకూడదు. వైద్యుడిని కలిపి ఆహార పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలి.

Also read: వేసవి ఆహారంలో ఈ ఐదు ఆకుపచ్చ పండ్లు చేర్చండి, చక్కటి ఆరోగ్యం మీ సొంతం

Also read: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలా? అయితే రాత్రి పడుకునే ముందు ఈ నాలుగు పనులు చేయండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Embed widget