News
News
X

Health Issues : ఎవర్ని చూసినా జలుబు, దగ్గు - మీకు అలాగే ఉందా ? - కారణం ఏమిటో తెలుసా ?

దేశవ్యాప్తంగా ఓ కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతోంది. యాంటీ బయాటిక్స్ వాడవద్దని ఐఎంఏ సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Health Issues : ఇప్పుడు మన చుట్టూ ఉన్న వారిని ఒక్క సారిగా పరికించి చూడండి. ప్రతి ఐదు మందిలో ముగ్గురు,నలుగురు దగ్గు , జలుబుతో బాధపడుతూ కనిపిస్తున్నారు. మీకు కూడా అలాంటి ఫీలింగే ఉండవచ్చు. లేకపోతే అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే.. అత్యధిక మంది ఏదో తేడాగా ఉండే అనుకునే అనారోగ్య వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. ఆస్పత్రి పాలయ్యేంత పెద్దగా కాకపోయినా..  దగ్గు, జలుబుతో ఇప్పటికే చాలా మంది ఆస్పత్రి పాలవుతున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్  వెల్లడించింది. దేశంలోని అనేక ప్రాంతాలలో గత రెండు నెలల్లో దీర్ఘకాలిక అనారోగ్యం, దీర్ఘకాలిక దగ్గుతో అధిక సంఖ్యలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు నమోదవుతున్నాయి. 

దేశంలో ఇన్‌ఫ్లుయెంజా ఎ సబ్‌టైప్ హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి !                 

రెండు సంవత్సరాల కొవిడ్ మహమ్మారి అనంతరం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.భారతదేశం అంతటా అధిక సంఖ్యలో జ్వరం, ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా ఎ సబ్‌టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇలా జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఈ వైరస్ వల్లనే దేశంలో గత రెండు, మూడు నెలలుగా ఈ తరహా కేసులు వస్తున్నాయని వెల్లడించింది. ఈ వ్యాధికి గురైన బాధితుల్లో ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు ఉండడాన్ని గమనించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా చాలా సమయం పడుతోంది.

వెంటాడే జలుబు - దగ్గు  - జాగ్రత్తలు తప్పని సరి !                       

 రోగి కోలుకున్న తర్వాత కూడా లక్షణాలు చాలా కాలం పాటు ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ వల్ల అంతగా భయపడేదేంలోదని, ప్రాణాపాయం కూడా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ కొంతమంది శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఇది కూడా కొవిడ్ లక్షణాలనే పోలి ఉంటున్నాయంటున్నారు.  వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు అనుసరించాల్సిన విధులను కూడా ఐసీఎఆర్  ఇప్పటికే సూచించింది. 

యాంటీ బయాటిక్స్ ఇష్టారీతిన వాడవద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూాచన !                     

 దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను విచక్షణారహితంగా వాడకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సూచించింది. యాంటీబయాటిక్స్ కాకుండా రోగలక్షణ చికిత్సను మాత్రమే సూచించాలని అసోసియేషన్ వైద్యులను కోరింది. తాము ఇప్పటికే కొవిడ్ సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్‌లను విస్తృతంగా ఉపయోగించడాన్ని చూశామని తెలిపింది. యాంటీబయాటిక్స్ సూచించే ముందు ఇన్‌ఫెక్షన్ బ్యాక్టీరియా కాదా అని నిర్ధారించడం అవసరం అని వైద్య సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఐసీఎంఆర్ సూచించిన సూచనలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రజలకు గుర్తు చేస్తున్నారు.                  

Published at : 04 Mar 2023 04:52 PM (IST) Tags: Indian Medical Association A new virus in the country cold cough virus

సంబంధిత కథనాలు

Toxic Food: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్

Toxic Food: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్

Prostate Cancer: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!

Prostate Cancer: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే

Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి