By: Haritha | Updated at : 25 Jan 2023 07:41 AM (IST)
(Image credit: Pixabay)
ప్రపంచంలో న్యూమోనియా కారణంగా మరణిస్తున్న వారిలో మన దేశం వాటా 23%. అంటే భారతదేశంలో న్యూమోనియా బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. చలికాలం వస్తే చాలు ఎక్కువమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నట్టు అంచనా. న్యూమోనియా, సాధారణ జలుబు మధ్య తేడా తెలియక కొంతమంది పరిస్థితి చేయి దాటే వరకు వైద్యుని సంప్రదించరు. దీనివల్ల మరణాల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు వైద్యులు. దగ్గు, జలుబు, జ్వరం... ఇవే న్యూమోనియాలో కూడా కనిపించే లక్షణాలు. వీటిని సాధారణ ఫ్లూ కేసులుగానే భావిస్తూ ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు కొంతమంది రోగులు. దీనివల్ల పరిస్థితి చేయి దాటుతోంది. రెండు రోజులకు మించి జలుబు, దగ్,గు జ్వరం వేధిస్తే కచ్చితంగా వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
ఏమిటి కారణం?
న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు సోకే ఒక ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు వంటి వివిధ రకాల సూక్ష్మజీవులు ఈ రోగానికి కారణం అవుతాయి. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, హిమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా, సూడోమోనాస్ వంటి బ్యాక్టీరియాల వల్లే న్యూమోనియా అధికంగా సోకుతుంది.
జలుబు, దగ్గు వచ్చినప్పుడు అది సాధారణమైనదా లేక న్యూమోనియానా అని తెలుసుకోవడం ఎలానో వివరిస్తున్నారు వైద్యులు. దగ్గినప్పుడు రక్తం కనిపించినా, కఫం పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారినా, జ్వరంతోపాటు చలి అధికంగా వేసినా, పెదవుల రంగు మారినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినా, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఛాతిలో నొప్పి వచ్చినా అది న్యూమోనియా ఏమోనని అనుమానించాలి. న్యూమోనియా తీవ్రంగా ఉన్నప్పుడు ఆ మనిషికి గందర గోళంగా అనిపిస్తుంది, మానసికంగా అతడు స్థిరంగా ఉండలేడు. మతిమరుపు కూడా అనిపిస్తుంది. రక్త పరీక్షలు, కఫం పరీక్ష. ఛాతి ఎక్స్ రే వంటి పరీక్షల ఆధారంగా అది న్యూమోనియానో కాదు నిర్ధారిస్తారు వైద్యులు.
2 నుండి 65 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారికి న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ధూమపానం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడం, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్ వంటి వ్యాధులు ఉన్నవారికి న్యూమోనియా త్వరగా సోకుతుంది. న్యూమోనియా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అలాగే ప్రతి ఏడాది ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తినాలి. విటమిన్ సి, జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. పరిశుభ్రతను పాటించాలి.
Also read: నోరా వైరస్ - కేరళలోని పిల్లల్లో సోకుతున్న అంటు వ్యాధి, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి
Deodorant Death: డియోడరెంట్ వాసనకు ఆగిన బాలిక గుండె - ఆ స్మెల్ అంత ప్రమాదకరమా?
CM Jagan Review : మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, సీఎం జగన్ ఆదేశాలు
Avocado: రోజుకో అవకాడో తింటే బరువు తగ్గుతారా? గుండె జబ్బులు దరిచేరవా?
Bruxism: నిద్రలో పళ్ళు గట్టిగా కొరికేస్తున్నారా? జాగ్రత్త, ఈ సమస్యలు తప్పవు!
నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్‌లు!
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!