(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips : చలికాలంలో మీ ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే
Health Tips : కాల్షియం అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్‌లో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే డ్రై ఫ్రూట్స్ తినడం ముఖ్యం. వీటిని తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
Health Tips In Telugu : ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలి. ముఖ్యంగా కాల్షియం శరీరానికి చాలా అవసరం. శరీరంలో కాల్షియం లోపం ఉంటే నిద్రలేమి, కండరాల నొప్పి, గోళ్లు విరగడం, మలబద్దకం వంటి అనేక సమస్యలు వస్తాయి. మీరు మీ ఆహారంలో పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కూరగాయలు లేదా కొన్ని తృణధాన్యాలు చేర్చడం ద్వారా కాల్షియం లోపాన్ని కూడా అధిగమించవచ్చు. ఇవి కాకుండా, కొన్ని డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. ఎందుకంటే కొన్ని డ్రైఫ్రూట్స్ లో కాల్షియం అధికమోతాదులులో ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో కాల్షియం లోపాన్ని తొలగించవచ్చు. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం:
బాదం పప్పులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇదే కాకుండా.. విటమిన్-ఇ వంటి ముఖ్యమైన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు బాదంలో ఉంటాయి. మీరు ప్రతిరోజూ బాదం తింటే, శరీరంలోని కాల్షియం లోపం తొలగిపోతుంది. మీకు అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
అత్తి పండ్లు:
అత్తి పండ్లు (అంజీర్ - Figs) రుచితోపాటు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో క్యాల్షియం తగినంత పరిమాణంలో ఉంటుంది. అంతే కాకుండా అత్తి పండ్లలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.
ఖర్జూరం:
ఖర్జూరం తీపి, రుచిగా ఉండటమే కాకుండా అనేక సమస్యలను నివారిస్తుంది. మీరు ఖర్జూరాలను ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవచ్చు.
పిస్తాపప్పు:
శరీరంలో కాల్షియం లోపాన్ని అధిగమించడానికి, మీరు మీ ఆహారంలో పిస్తాలను చేర్చుకోవచ్చు. దీన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయి. అంతే కాకుండా రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. దీని వల్ల అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
వాల్నట్:
కాల్షియం వాల్‌నట్స్‌లో కూడా ఉంటుంది. ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే ఇందులో కాల్షియం పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి, మీరు మీ ఆహారంలో వాల్‌నట్‌లను కూడా భాగం చేసుకోవచ్చు.
బ్రెజిల్ గింజలు:
బ్రెజిల్ గింజలు ఆరోగ్యానికి నిధి వంటివి. వీటిలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం కూడా ఇందులో ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ గింజలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
Also Read : మీ స్కిన్ టోన్ డార్క్ అవుతోందా? ఈ ఇంటి చిట్కాలతో టాన్ రిమూవ్ చేసేయొచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.