BeetRoot Juice: రోజూ అరగ్లాసు బీట్‌రూట్ రసం తాగితే అందం రెట్టింపవ్వడం ఖాయం
బీట్ రూట్ రసం అనగానే చాలామందికి నచ్చదు. కానీ దానివల్ల చర్మానికి, జుట్టుకు ఎంతో అందం, ఆరోగ్యం.
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో బీట్‌రూట్ కూడా ఒకటి. వీటిని తినమని వైద్యులు కూడా ప్రత్యేకంగా సూచిస్తూ ఉంటారు. దీంట్లో ఉండే పోషకాలు రక్తహీనత సమస్య నుంచి శరీరాన్ని కాపాడతాయి. బీట్‌రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో మంచిది. బీట్‌రూట్ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కలిగే హానిని అడ్డుకుంటాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. బీట్‌రూట్ రసాన్ని రోజూ అరగ్లాసు తాగితే ఎంతో మేలు. నెలరోజుల పాటు బీట్‌రూట్ రసం తాగి చూడండి. ఈ చర్మంలోని మెరుపును, జుట్టులో పెరుగుదలను మీరే గమనిస్తారు.
1. బీట్‌రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయని ముందే చెప్పుకున్నాం. ఇవి చర్మంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. ముడతలు, నల్ల మచ్చలు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. వృద్ధాప్య సంకేతాలను త్వరగా రాకుండా నిరోధిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
2. బీట్రూట్ జ్యూస్‌లో ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలే సమస్య ఉన్నవారు బీట్రూట్ జ్యూస్ తాగండి.
3. మెరుగైన మేని వర్ణాన్ని ఎవరు మాత్రం కోరుకోరు? బీట్‌రూట్లో బీటా లైన్లు ఉంటాయి. ఇవి చర్మానికి రక్తప్రసరణను పెంచడంలో సహాయపడతాయి. రక్తప్రసరణ పెరగడం వల్ల చర్మం కాంతివంతంగా మంచి రంగును పొందుతుంది.
4. ఈ రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికం. శరీరంలో ఉన్న ఇన్ఫ్లేమేషన్‌ను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. మొటిమలు, రోసెసియా, తామర వంటి చర్మ పరిస్థితులను రాకుండా ఇవి అడ్డుకుంటాయి.
5. బీట్‌రూట్ జ్యూస్ అనేది సహజమైన డిటాక్సిఫైయర్. పరగడుపున ఖాళీ పొట్టతో బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని విషాన్ని తొలగించుకోవచ్చు. వ్యర్ధాలు, టాక్సిన్లు శరీరంలోని రక్తంలో చేరుతాయి. ఇవన్నీ కూడా బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల బయటకి పోతాయి. ఇలా పోవడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. మొత్తం మీద శరీర ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది.
అవసరం అయితే బీట్ రూట్, క్యారెట్ కలిపి జ్యూస్ చేసుకుని తాగవచ్చు. క్యారెట్లో కూడా చర్మానికి, జుట్టుకు మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. కొంతమంది బీట్ రూట్, క్యారెట్, కొత్తి మీర, పుదీనా, టమాటో కలిపి జ్యూస్ చేసుకుని తాగుతారు. ఇలా చేయడం వల్ల మధుమేహం కూడా అదుపులో ఉంటుందని అంటారు.
Also read: ఉదయాన్నే టీ, కాఫీలకు గుడ్ బై చెప్పండి, ఈ ఆరోగ్యకరమైన ఆహారాలతో మీ రోజును మొదలుపెట్టండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.