మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Horlicks: హార్లిక్స్ ఇకపై తమ ఉత్పత్తులను హెల్త్ డ్రింక్స్ కేటిగిరీలో నుంచి తొలగించనున్నట్టు కీలక ప్రకటన చేసింది.
Horlicks Health Drink: పిల్లలు ఎంతో ఇష్టపడే హార్లిక్స్ ఇకపై హెల్తీ డ్రింక్స్ (Horlicks) జాబితాలో కనిపించదు. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ హార్లిక్స్‌తో పాటు బూస్ట్‌నీ Health Drinks కేటగిరీ నుంచి తొలగించింది. వాటిని న్యూట్రిషన్ డ్రింక్స్ (functional nutritional drinks) జాబితాలోకి చేర్చింది. అంతే కాదు. హార్లిక్స్ ప్యాక్‌లపై Health అనే లేబుల్‌నీ తొలగించనుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం హెల్త్ డ్రింక్స్ పేరు చెప్పి తీపి ఎక్కువగా ఉన్న ఉత్పత్పులను విక్రయిస్తున్నారని మండి పడింది. పైగా వాటిని హెల్త్ డ్రింక్స్ జాబితాలో చేర్చడంపై మరింత అసహనం వ్యక్తం చేసింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అన్నీ వాటిని హెల్త్ డ్రింక్స్ జాబితాలో నుంచి తొలగించాలని తేల్చి చెప్పింది. అంతకు ముందు బోర్న్‌విటాపైనా (Bournvita) ఇలాంటి నిషేధమే విధించింది. ఈ మేరకు హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ సంస్థ అప్రమత్తమైంది. ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రితేశ్ తివారీ ఈ విషయం వెల్లడించారు. తమ సంస్థ అత్యంత పారదర్శకంగా ఉంటుందని, వాటిని ఏ కేటగిరీలో చేర్చిన విషయాన్ని కూడా అందుకే వెల్లడించామని వివరించారు.
న్యూట్రిషనల్ డ్రింక్ అంటే ఏంటి..?
హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం హార్లిక్స్ ఇకపై న్యూట్రిషన్ డ్రింక్‌గా మార్కెట్‌లో చెలామణీ అవుతుంది. మరి న్యూట్రిషన్ డ్రింక్ అంటే ఏంటి..? ఎవరిలో అయితే ప్రోటీన్‌లు, మైక్రో న్యూట్రియంట్‌లు తక్కువగా ఉంటాయో వాళ్లకు ఈ డ్రింక్ వల్ల ఆ సమస్య తీరిపోతుంది. నాన్ ఆల్కహాలిక్ డ్రింక్‌నీ ఇలా functional nutritional drinks కేటగిరీలో చేర్చుతారు. ఇది తాగితే పోషకాలు లభిస్తాయని సంస్థ ప్రచారం చేస్తోంది. Institute for Integrative Nutrition ప్రకారం..డైట్ ఫాలో అయ్యే వాళ్లకి ఈ ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ బెస్ట్ ఆప్షన్.
హెల్త్ డ్రింక్స్ అనేవే లేవట..
అయితే...Food Safety and Standards Act 2006 చట్టంలో ఎక్కడా Health Drinks కి నిర్వచనం లేదని, అలాంటప్పుడు వాటిని హెల్త్ డ్రింక్స్‌గా లేబుల్ వేసి ఎలా విక్రయిస్తారని కేంద్రం ప్రశ్నించింది. బోర్న్‌విటాతో పాటు హార్లిక్స్‌లో మితిమీతి చక్కెర శాతం ఉంటోందని గుర్తించింది. బోర్న్‌విటాలో ఈ లోపం బయటపడగానే మిగతా డ్రింక్స్‌పైనా ఫోకస్ పెట్టారు. అలా హార్లిక్స్‌లోనూ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. National Commission for Protection of Child Rights కూడా దీనిపై సీరియస్ అయింది. పిల్లలకు ఇలాంటి డ్రింక్స్ తాగించడం వల్ల వాళ్లకు రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. షుగర్‌తో పాటు ఊబకాయం కూడా వచ్చే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం ఇంకాస్త అప్రమత్తమై వెంటనే ఆయా సంస్థల ఉత్పత్తులను పరిశీలించింది. ఈలోగా హార్లిక్స్ సంస్థ స్పందించి తమకు తాముగానే హెల్త్ లేబుల్‌ని తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇక కొన్ని మసాలా ఉత్పత్తుల్లోనూ హానికారక రసాయనాలున్నాయని తేలడం ఆందోళనకు గురి చేస్తోంది. వాటినీ కేంద్రం పరిశీలిస్తోంది.
Also Read: ఈ యువతి 24 గంటలూ మెలకువతోనే ఉంటుందట, నిద్రపోనివ్వని జబ్బుతో నరకం