అన్వేషించండి

New Study: మీకు రోజూ బీరు తాగే అలవాటుందా? అయితే మీ మెదడు త్వరగా ముసలిదైపోతుంది

చాలా మంది బీరును ఆల్కహాల్ అనుకోరు. రోజూ తాగుతారు.

వేసవి వచ్చేస్తుంది. ఇక చల్లని బీరు ఇళ్లల్లో ఏరులై పారుతుందేమో. చల్లని బీరు తాగడం వల్ల నాలికకు కూల్‌గా ఉంటుందేమో కానీ శరీరానికి మాత్రం వేడి చేస్తుంది. కొంతమంది బీరును ఆరోగ్యకరమైన పానీయంగా  భావిస్తారు. ఆల్కహాల్ జాబితాలో చేర్చరు. అందుకే ఆడా, మగా తేడా లేకుండా తాగే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా దీన్ని ఏకంగా పెద్ద గ్లాసుతో లాగిస్తారు. ఒక గ్లాసు బీరు తాగడం వల్ల మీ మెదడు వయసు రెండేళ్లు పెరిగిపోతుందని చెబుతోంది ఒక కొత్త అధ్యయనం. ఇక రోజూ బీరు తాగే వాళ్లలో అయితే వారి కన్నా కూడా మెదడు ముందుగా ముసలిదైపోతుందని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన నిపుణులు నిర్వహించారు. 

మెదడు పరిమాణాన్ని లెక్కించడానికి ముందుగా పరిశోధకులు 36,000 మంది పెద్దల ఎమ్ఆర్ఐ స్కాన్‌లను విశ్లేషించారు. తరువాత వారు తీసుకునే ఆల్కహాల్ శాతాన్ని గుర్తించారు. 40 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సు గల రోగుల MRI రికార్డులను తనిఖీ చేసి అధ్యయనం చేశారు. వారి మెదడులో వైట్ అండ్ గ్రే మ్యాటర్ ఎంత ఉందో చెక్ చేయాలనేది వారి అభిప్రాయం. ఆ పరిశోధనలో 50 ఏళ్ల వరకు రోజు ఒక గ్లాసు బీరు తాగడం వల్ల వారి మెదడు వయసు ఆరునెలలు పెరిగిందని గుర్తించారు. మెదడు పరిమాణం కూడా పెరిగినట్టు తెలిపారు. 

రోజుకు రెండు గ్లాసుల బీరు తాగే వారి మెదడు వయసు రెండున్నరేళ్లు పెరిగినట్టు తేల్చారు. అదే గ్లాసుల సంఖ్య రోజులో నాలుగుకు పెంచినట్లయితే మెదడు వయసు పదేళ్ల వృద్ధాప్యానికి దారితీస్తుందని గుర్తించారు. అంటే బీరు మెదడును ముసలిదాన్ని చేస్తుందని పరిశోధనా ఫలితం. యుకేలోని బయోబ్యాంక్ నుంచి తెప్పించుకున్న డేటాను పరిశీలించిన పరిశోధకులు ప్రజల మద్యపాన అలవాట్లను ట్రాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ పని చేయడానికి చాలా సమయం పడుతుందని గుర్తించారు. 

మెదడుపై మద్యపానం ప్రభావం అధికంగానే ఉంటుందని, దీనిపై మరింత లోతైన పరిశోధన అవసరమని తెలిపారు అధ్యయనకర్తలు.  

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగుతున్నారా? ఈ ఆరోగ్యసమస్యలు తప్పవు మరి

Also read: న్యూజనరేషన్ ప్లేట్, తినే కంచంలో ఫోనుకీ స్థానం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget