Covid Update: 2 లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు.. 1000 మందికిపైగా మృతి
దేశంలో కరోనా కేసులు 2 లక్షలకు దిగువనే నమోదయ్యాయి. కానీ మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది.
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1,67,059 కేసులు నమోదుకాగా మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. ఒక్కరోజులో 1,192 మంది మృతి చెందారు. కేరళ రాష్ట్రం మునుపటి గణాంకాలను సవరించడం వల్లే మరణాలు భారీగా పెరిగాయి. 2,54,076 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.2గా ఉంది.
- యాక్టివ్ కేసులు: 17,43,059
- మొత్తం కేసులు: 4,14,69,499
- మొత్తం మరణాలు: 4,96,242
- మొత్తం కోలుకున్నవారు: 3,92,30,198
కేరళలో కొత్తగా 42,154 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 15,140 కరోనా కేసులు నమోదుకాగా 39 మంది మృతి చెందారు. మరోవైపు 91 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
దిల్లీలో కొత్తగా 2,779 కరోనా కేసులు నమోదుకాగా 38 మంది మృతి చెందారు.
భారత్లో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజులో 61,45,767 టీకా డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,66,68,48,204కు చేరింది.
నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 14 లక్షల 28 వేల 672 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్ట్ల సంఖ్య 73 కోట్లు దాటింది.
Also Read: Economic Survey 2021-22: పదేళ్లలో భారత్ ఇంత మారిపోయిందా.. ఈ ఫోటోలు చూడండి.. అస్సలు నమ్మలేరు!