అన్వేషించండి
Advertisement
Covid 19 Updates India: దేశంలో కొత్తగా 44,230 కరోనా పాజిటివ్ కేసులు, మరో 555 మరణాలు నమోదు
దేశంలో కొత్తగా 44, 230 కేసులు నమోదుకాగా 555 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3.15 కోట్లకు చేరింది.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. మరోసారి 44వేల పైనే రోజువారీ కేసులు నమోదయ్యాయి. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదు కావడం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మరోపక్క కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి కలవరానికి కారణంగా మారింది.
- గడిచిన 24 గంటల వ్యవధిలో తాజాగా 18,16,277 మందికి కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 44,230 మందికి పాజిటివ్‌గా తేలింది.
- దేశంలో మొత్తం కేసులు 3.15 కోట్లకు చేరాయి. నిన్న ఒక్కరోజే 555 మంది మృతి చెందారు.
- ఇప్పటివరకు 4,23,217 మంది కరోనా మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- ప్రస్తుతం 4,05,155మంది కొవిడ్19 చికిత్స తీసుకుంటున్నారు.
- ప్రస్తుతం యాక్టివ్ కేసుల రేటు 1.28 శాతంగా ఉండగా.. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 97.38 శాతానికి చేరింది.
- నిన్న ఒక్కరోజే 42,360 మంది కోలుకోగా.. మొత్తంగా 3.07 కోట్ల మంది వైరస్‌ను జయించారు.
వ్యాక్సినేషన్..
మరోపక్క నిన్న 51,83,180 మంది కరోనా టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 45,60,33,754కు చేరుకుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion