By: ABP Desam | Updated at : 12 Feb 2022 10:21 AM (IST)
భారత్‌లో తగ్గిన కరోనా కేసుల సంఖ్య
India covid cases today: భారత్‌లో రోజురోజుకు కరోనా(Corona) కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో 50,407 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రోజువారీ పాజిటివటీ రేటు కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 804 కరోనా కారణంగా మరణించారు.
గత 24 గంటల్లో 97.37 శాతం రికవరీ రేటుతో 1,36,962 మంది కోవిడ్-19(Covid-19) వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,10,443గా ఉన్నాయి. ఇది ఇప్పటివరకు మొత్తం కేసులలో 1.43 శాతం.
15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయడానికి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత, దేశంలో దాదాపు 172.29 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పూర్తయ్యాయి.
Koo App#COVID19 vaccination update - Day 392 ✅Cumulative vaccination coverage crosses 172 crore ✅Doses administered - 1st dose: 95.51 crore; 2nd dose: 75.04 crore ✅More than 42 lakh doses administered today till 7 pm #LargestVaccineDrive Read: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1797776 - PIB India (@PIB_India) 11 Feb 2022
కేరళ(Kerala)లో ఇప్పటికి కూడా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 16,012 కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో రాష్ట్రంలో 27 మంది మృతి చెందారు.
మహారాష్ట్ర(Maharashtra)లో గత 24 గంటల్లో 5,455 మందికి వైరస్ సోకింది. వైరస్ బారిన పడి 63 మంది చనిపోయారు. ముంబైలో రెండు మరణాలతో 429 కేసులు నమోదయ్యాయి.
దిల్లీ(Delhi)లో గడచిన 24 గంటల్లో 977 కోవిడ్ కేసులు గుర్తించారు. 12 మంది మరణించారు. దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉంది.
కర్ణాటక(Karnataka)లో గత 24 గంటల్లో 3,976 కోవిడ్ కేసులు నమోదవ్వగా 41 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్(West Bengal)లో గత 24 గంటల్లో 27 మరణాలతో 767 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
కోవిడ్-19 కేసుల తగ్గుదల కారణంగా, అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు సడలిస్తున్నారు. విద్యాసంస్థలు తెరుస్తున్నారు.
Corona New Variant : భారత్‌లో మరో కొత్తరకం వేరియంట్ - కొత్త వైరస్‌ను కనిపెట్టిన డబ్ల్యూహెచ్‌వో !
Corona Cases: దేశంలో కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్- తాజాగా 18,930 మందికి కరోనా
Covid Update: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- మహారాష్ట్రలో వైరస్ విజృంభణ
Covid Update: దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు- 19 మంది మృతి
Corona Cases: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు- 24 మంది మృతి
Rishi Sunak Profile: ఇంగ్లాండ్ ప్రధాని రేసులో ఇండియా సంతతి వ్యక్తి- రిషి సునక్ ఎవరో తెలుసా?
YSRCP Plenary 2022 : ప్లీనరీ సక్సెస్ చూసి చంద్రబాబు మళ్లీ బోరు బోరున ఏడుస్తారు - ఎంపీ విజయసాయి రెడ్డి
Online Vs Offline Food: ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే అంత ఖరీదా? అంటే కూపన్ల ఆఫర్ హంబక్కేనా? తేడా చూడండి!
IND-W vs SL-W, 3rd ODI: హర్మన్ ప్రీత్ డిస్ట్రక్షన్! లంకను కుప్పకూల్చిన రాజేశ్వరీ, మేఘనా