By: ABP Desam | Updated at : 17 Mar 2022 07:10 PM (IST)
నాలుగో వేవ్ వచ్చేస్తోంది - రాష్ట్రాలకు కేంద్రం జాగ్రత్తలు !
కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ప్రపంచానికి ఇప్పుడు కొత్తగా స్టెల్త్ బీఏ.2 రకం వైరస్ గండం ఏర్పడింది. ఇప్పటికే చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దాంతో చైనాలోని పలు నగరాల్లో లాక్ డౌన్ విధించారు. దీంతో దేశంలోనూ అప్రమత్తమవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుదల వంటి మూడు అంశాల చర్చించారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని నిర్ణయించారు.
ఇజ్రాయెల్‌లో మరో ప్రమాదకర కరోనా వైరస్ - బీఏ.2, ఒమిక్రాన్ రెండూ కలిసిన కొత్త వేరియంట్
కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతున్న క్రమంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కరోనా నాల్గో వేవ్ ముప్పును ముందుగానే కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నామని ప్రకటించారు. ఆగ్నేయాసియా, చైనా, యూరప్‌ల నుంచి మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయాన్ని సమీక్షించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలనే ఆదేశాలను రద్దు చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు.
ఇక "స్టెల్త్ ఒమిక్రాన్" సీజన్ - మళ్లీ మాస్కులు, కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు తప్పవా ?
కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ నెమ్మదిగా విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 1,80,60,93,107 టీకా డోసులను పంపిణీ చేశారు. ఈ మేరకు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా బుధవారం 7,52,818 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు దేశంలో 78.05 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ వెల్లడించింది.
చైనా నగరాల్లో మళ్లీ లాక్ డౌన్ - కోవిడ్ ఎంత తీవ్రంగా విస్తరిస్తుందో తెలుసా ?
కరోనా వైరస్ ధర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాపించింది.అయితే ఆ వేరియంట్ లక్షణాలు అంత తీవ్రంగా లేవు. ఈ కారణంగా పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. కేసులు కూడా వేగంగా తగ్గిపోయాయి. అయితే కొత్త వేరియంట్ ఎలా ఉంటుందో .. దాని ప్రభావం ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు కూడా ఇంకా అంచనా వేయలేదు. అందుకే ముందు జాగ్రత్తలు మేలని కేంద్రం భావిస్తోంది.
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!
Covid 19 in North Korea: కిమ్ రాజ్యంలో కరోనా వైరస్ వీరవిహారం- 10 లక్షలకు పైగా కేసులు!
Coronavirus Cases: దేశంలో కొత్తగా 2,202 కరోనా కేసులు- 27 మంది మృతి
Stock Market News: శుక్రవారం డబ్బుల వర్షం! రూ.5.5 లక్షల కోట్లు ఆర్జించిన ఇన్వెస్టర్లు, సెన్సెక్స్ 1163+
CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు
Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!
Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి