AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 108 కరోనా కేసులు, ఒకరు మృతి...
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 108 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 1878 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 21,010 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 108 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,467కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 141 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,631 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1878 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: As on 13th December, 2021 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 13, 2021
COVID Positives: 20,72,081
Discharged: 20,55,736
Deceased: 14,467
Active Cases: 1,878#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/3xSt18QzmN
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,976కి చేరింది. గడచిన 24 గంటల్లో 141 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1878 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,467కు చేరింది.
Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 7,350 కరోనా కేసులు నమోదుకాగా 202 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 561 రోజుల కనిష్ఠానికి చేరాయి. ప్రస్తుతం 91,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం మరణాలు: 4,75,636
- యాక్టివ్ కేసులు: 91,456
- కోలుకున్నవారు: 3,41,30,768
కొత్తగా 7,973 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.26గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.37గా ఉంది. మరణాల రేటు 1.37 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఆదివారం 19,10,917 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,33,17,84,462కు చేరింది. ఒమిక్రాన్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య 38కి చేరింది. ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగితే దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు 63 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి