Avocado Health Benefits : రోజుకో అవకాడో తింటే షుగర్‌కు గుడ్ బై చెప్పొచ్చా, తాజా అధ్యయనంలో ఏం తేలింది?
Avocado Health Benefits : బిజీ లైఫ్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి డయాబెటిస్‌కు దారి తీస్తోంది. మరి, ఈ వ్యాధిని అరికట్టేందుకు అవకాడో తినొచ్చా? దీనిపై పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Avocado Health Benefits : ఈ రోజుల్లో గాడి తప్పిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ ఒక్కసారి సోకిందంటే.. నయం కావడం అసాధ్యం. ఇది ప్రాణాంతక వ్యాధి కాదు. కానీ, తియ్యని స్లో పాయిజన్ లాంటిది. దీన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకు ముప్పు తప్పదు. శరీరంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసుకోవడం ఒక్కటే అసలైన మందు. అందుకే షుగర్ బాధితులు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ అవకాడో తింటే షుగర్ అదుపులో ఉంటుందని తాజా అధ్యయనం పేర్కొంది. అవకాడోలో పీచుపదార్థం ఎక్కువగా.. కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ పేషంట్లకు మంచి ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ ఒక అవకాడోను ఆహారంలో భాగం చేసుకుంటే డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టైప్ 2 డయాబెటిస్ అనేది తీవ్ర సమస్యగా మారింది. ప్రపంచంలోని వయోజన జనాభాలో దాదాపు 10.5 శాతం మందికి టైప్ 2 డయాబెటిస్ ప్రభావితం చేస్తుంది. వీరిలో 50 శాతం మందికిపైగా టైప్ 2 డయాబెటిస్ ను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో టైప్ 2 డయాబెటిస్ ప్రాబల్యం గణనీయంగా పెరగడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 డయాబెటిస్ 46 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 783 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఇందులో 90 శాతం టైప్ 1 మధుమేహంతో, టైప్ 2లో టైప్ 2 కలిగి ఉన్నారని పేర్కొంది. అయితే ఇది జీవనశైలితో పాటు వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. అంతేకాదు స్ట్రోక్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, నరాలు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పేర్కొంది. 30 ఏళ్లలోపు వారిలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే టైప్ 2 డయాబెటిస్‌ను డెవలప్ చేసే ప్రమాదాన్ని తగ్గించే సామార్థ్యం అవకాడోలో ఉందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది.
అవకాడోను పోషకాల పవర్ హౌస్:
అవకాడోను పోషకాల పవర్ హౌస్ అంటారు. రుచితోపాటు ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. నిత్యం అవకాడో డైట్లో చేర్చుకున్నట్లయితే గుండె ఆరోగ్యం, కంటి ఆరోగ్యం, బరువు తగ్గడంతోపాటు డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అవకాడోలో జింక్, విటిమిన్ బి6, విటమిన్ బి2, మాంగనీస్, ఫొలేట్, విటమిన్ కె, విటమిన్ ఎ, మిటమిన్ బి3, విటమిన్ సి, ఐరన్, కోలిన్, మెగ్నీషియం, ఫైబర్, కార్బొహైడ్రెట్స్, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే అవకాడోను పోషకాలకు పవర్ హౌస్ వంటిది అంటారు.
అవకాడో తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందా?
45 నుంచి 84 ఏళ్ల వయస్సున్న 6 వేల మంది డేటాను విశ్లేసించిన తర్వాత అవకాడో తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనం వెల్లడించింది. అవకాడో తీసుకున్న వారిలో రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను పరిశీలించారు పరిశోధకులు. అవకాడో తిన్నవారిలో మెటాబాలిజం ఉత్పత్తి అయినట్లు పరిశీలించారు. అయితే ప్రతిఒక్కరిలో ఇలాంటి చర్య చూపనప్పటికీ కొంతమందిలో మాత్రం బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉందని ఫలితాలు సూచించాయి. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను అవకాడో తగ్గించగలదని పరిశోధన నొక్కి చెబుతుంది. అవకాడో తినేవారిలో ఆరేళ్లలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 20 శాతం తగ్గినట్లు పరిశోధనలో తేలింది. అంతేకాదు బరువు తగ్గడం, ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించి..హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ ను నిర్వహించడానికి సహాయపడింది.
Also Read : ఈ దోశ బరువును, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది.. రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.