అన్వేషించండి

What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!

What Is Stair Test For Heart Blockage:మెట్లు ఎక్కేటప్పుడు చాలా మంది ఆయాస పడుతుంటారు. ఇది సాధారణమైన విషయంగా భావిస్తారు. కానీ ఇది ప్రమాదకరమైన వ్యాధులకు కారణం కావచ్చు. వెంటనే వైద్యుణ్ని సంప్రదిస్తే మేలు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం, అలసట పెద్ద ఆరోగ్య సమస్యలకు సంకేతం.
  • గుండె, ఊపిరితిత్తుల లోపాలు, రక్తహీనత, అధిక బరువు ప్రధాన కారణాలు.
  • పది మెట్లు ఎక్కినప్పుడే ఆయాసం వస్తే వైద్యుడిని సంప్రదించాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన పోషకాహారం, బరువు నిర్వహణ ముఖ్యం.

How Do You Know When Breathlessness Is Serious: మనం రోజువారీ పనులు చేస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే ఇబ్బందులు చిన్నవిగా చూడొద్దు. మెట్లు ఎక్కేటప్పుడు కొందరు విపరీతంగా అలసిపోతుంటారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఒకట్రెండు ఫ్లోర్‌లు ఎక్కితే చాలు ఊపిరి ఆడదు. గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇది సాధారణమని కొందరు అనుకుంటారు. కాస్త లావు అయ్యాననో, ఈ మధ్య ఎక్కువ దూరం నడవడం లేదు అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందనే సరిపెట్టుకుంటారు. కానీ ఇది ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతాలు కావచ్చని గ్రహించరు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

ప్రతి అలసటను సాధారణమైనదిగా భావించడం తప్పని వైద్య నిపుణులు చెబుతున్నారు. పదే పదే ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే మాత్రం కచ్చితంగా ఏదో పెద్ద సమస్య ఉన్నట్టు గ్రహించాలని సూచిస్తున్నారు. అందుకే వెంటనే వైద్యుణ్ని సంప్రదించి అసలు కారణాలను గుర్తించాలని సజెస్ట్ చేస్తున్నారు. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. 

మెట్లు ఎక్కేటప్పుడు వచ్చే ఆయాసానికి కారణమేంటీ?

ఏదైనా పని చేసినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు మాత్రమే గట్టిగా ఊపిరి తీసుకుంటాం. అంటే ఆ సమయంలో మనకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుందని అర్థం. నార్మల్‌గా ఊపిరి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ నార్మల్‌గా అవసరం అవుతుంది. కానీ ఏదైనా పని చేస్తేనే ఆక్సిజన్ ఎక్కువ అవసరం. అలాంటి సమయంలో శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందించడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయాసం వస్తుంది.

గుండె జబ్బుల ముప్పు 

మీరు మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువ ఆయాస పడుతున్నారంటే కచ్చితంగా గుండెలో ఏదైనా సమస్యకు కారణం కావచ్చు. మీకు కావాల్సిన ఆక్సిజన్ అందివ్వడంలో గుండెలోని పార్ట్స్‌ ఇబ్బంది పడుతుంటే ఆయాసం ఎక్కువ అవుతుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. శ్వాస తీసుకోలేరు. దీని కారణంగా ఎక్కువ ఒత్తిడికి గురై  గుండె పని చేయడం ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆయాసం వస్తుంటే సమస్యను తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించాలి. 

ఆస్తమా కావాచ్చు

గుండె సమస్యే కాదు, ఊపిరితిత్తుల పనితీరులో లోపం కూడా ఆయాసానికి కారణం కావచ్చు. ఆస్తమా, సీవోపీడీ ఉన్న రోగులకు ఈ ఆయాసం సమస్య ఉంటుంది. రోగుల్లో వాయు నాళాలు ఉబ్బి గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇది కూడా ఆయాసానికి కారణం కావచ్చు. 

రక్తహీనత 
రక్తంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు శరీర భాగాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్లే సామర్థ్యం రక్తంలో తగ్గిపోతుంది. అందుకే చిన్న పని చేసినా అలసిపోతుంటారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. 

అధిక బరువు 

శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మెట్లు ఎక్కడానికి ఇబ్బందిగానే ఉంటుంది. భూమి ఆకర్షణ శక్తిని కాదని పైకి వెళ్లడానికి సమస్యగానే ఉంటుంది. దీని వల్ల గుండెతోపాటు శరీరంలోని అన్ని అవయవాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. రోజూ కనీసం ఎక్స్‌ర్‌సైజ్‌ చేయని వారిలో కూడా ఈ సమస్య చూడవచ్చు. 

సాధారణ అలసట కాదని ఎలాగుర్తించాలి?

మెట్లు ఎక్కినప్పుడు ప్రతి ఒక్కరికీ కొంత అలసట సహజమే. అయితే ఏది ప్రమాదకరమో గుర్తించడం చాలా అవసరం. లేకుంటే చిన్న అలసటకే ఆందోళన చెందాల్సి ఉంటుంది. సాధారణ అలసట 2, 3అంతస్తులు వేగంగా ఎక్కినప్పుడు వస్తుంది. అలా కాకుండా పది మెట్లు ఎక్కగానే అలసిపోవడం ప్రమాదానికి సంకేతం కావచ్చు. 

బాగా అలసిపోయినప్పుడు ఒకట్రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సాధారణ స్థితికి రావచ్చు. ప్రమాదంలో ఉన్న వారికి మాత్రం చాలా సమయం విశ్రాంతి అవసరం అవుతుంది. అంతే కాకుండా వీరికి చాతిలో పట్టేసినట్టు ఉంటుంది. తలతిరగడం, చెమటలు పట్టడం జరుగుతుంది. వీటిలో ఏది ఉన్నా సరే వైద్యుణ్ని సంప్రదించడం మంచిది. 

మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రాకుండా ఏం చేయాలి? 

ఆయాసం వస్తుందని వైద్యుణ్ని సంప్రదించిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాత మీరు క్రమం తప్పకుండా అరగంట ఎక్స్‌ర్‌సైజ్ చేయండి. నడవడం, సైక్లింగ్, ఈత, కార్డియో వ్యాయామాలు చేయడం మంచిది. దీని వల్ల సాధారణ అలసట కూడా రాదు. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. ఐరన్ ఉండాలి అంటే ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్‌, పండ్లు బాగా తినాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. 

Frequently Asked Questions

మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం రావడం దేనికి సంకేతం?

మెట్లు ఎక్కేటప్పుడు అలసిపోవడం, ఊపిరి ఆడకపోవడం అనేది సాధారణ అలసట కావచ్చు, లేదా గుండె జబ్బులు, ఆస్తమా, రక్తహీనత వంటి ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతం కావచ్చు. వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం వస్తే గుండె సమస్య ఉందా?

అవును, మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువ ఆయాసం పడుతున్నారంటే గుండెకు సంబంధించిన సమస్య ఉండవచ్చు. శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించడంలో గుండె ఇబ్బంది పడుతుందని దీని అర్థం.

సాధారణ అలసటను ప్రమాదకరమైన ఆయాసం నుండి ఎలా గుర్తించాలి?

సాధారణ అలసట 2-3 అంతస్తులు వేగంగా ఎక్కినప్పుడు వస్తుంది, విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. పది మెట్లు ఎక్కగానే ఆయాసం, ఛాతీలో నొప్పి, తలతిరగడం వంటివి ఉంటే ప్రమాదకరం.

మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

వైద్యుడిని సంప్రదించి, ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. సరైన బరువును నిర్వహించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget