అన్వేషించండి

Diabetes : ఈ ఔషధంతో డయాబెటిస్ 14 రోజుల్లో కంట్రోల్ అవుతుందట!

డయాబెటిస్ వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ వస్తోంది. అయితే దీనిని లైఫ్ స్టైల్​లో పలు మార్పులతో కంట్రోల్ చేసుకోవచ్చు.

డయాబెటిస్  అనేది భారతదేశంలో అంత్యత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధి. మధుమేహానికి శాశ్వత చికిత్స లేకపోవడం ఒక ఆందోళన కలిగించే అంశం. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి అనేక అల్లోపతి మందులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయనే భయం ఉంది. అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద మందులతో కూడా చికిత్స చేసుకోవచ్చు. మధుమేహానికి ఆయుర్వేద చికిత్సకు మరో అడుగు ముందుకు వేస్తూ, ఢిల్లీలోని దేశంలోని ప్రధాన ఆరోగ్య పరిశోధనా సంస్థ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యుల బృందం, డయాబెటిస్, ఊబకాయం కోసం ఆయుర్వేద ఔషధం 'BGR-34' ను అభివృద్ధి చేసింది. ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) శాస్త్రవేత్తల పరిశోధనల అనంతరం  మార్కెట్లోకి విడుదల అయ్యింది. 

నిజానికి డయాబెటిస్ మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన వ్యాధి, దీనికి శాశ్వత నివారణ లేదు. అయినప్పటికీ ఈ ఆయుర్వేద  ఔషధం మధుమేహాన్ని నియంత్రించడంతో పాటుగా ఊబకాయాన్ని తగ్గించడంలో బాగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, దేశంలో 7.7 కోట్ల మందికిపైగా ప్రజలు డయాబెటిస్ తో బాధపడుతున్నారు.

2045 నాటికి ఈ సంఖ్య 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. డయాబెటిస్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్  హార్ట్ ఫెయిల్యూర్, అంధత్వం, కీళ్ల నొప్పులు, స్ట్రోక్ మొదలైన జబ్బులకు ప్రధాన కారణమవుతుంది. ఈ సమయంలో BGR-34 ఔషధం శరీర బరువును తగ్గించడంతో పాటు, హార్మోన్ మాడ్యులేషన్ ద్వారా రక్తంలో షుగర్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ తగ్గిస్తుంది

ఈ ఔషధం లెప్టిన్ సిగ్నలింగ్‌ను తగ్గిస్తుంది. హార్మోన్స్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్ ,  ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉన్న కారణంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్  పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే BGR-34 వాడటం ద్వారా రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ కంట్రోల్ లో ఉంటాయి.

రక్తంలో షుగర్ స్థాయి 14 రోజుల్లో తగ్గించవచ్చు:

పలు అధ్యయనాల్లో BGR-34 ఔషధం ద్వారా 14 రోజుల్లో రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు డయాబెటిస్  లక్షణాలతో పోరాడడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్  BGR-34 కోసం ఆయుర్వేద ఔషధాన్ని అనేక సహజ వృక్ష మూలాల మిశ్రమం నుంచి తయారు చేశారు. తిప్పతీగ, విజయ సర, ధరుహరిద,  మంజిష్ఠ వంటి మూలకాలను కలిగి ఉన్నందున ఈ ఔషధం చాలా చురుగ్గా పనిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు. 

దీంతో పాటు రోజూవారీ జీవితంలో పలు మార్పులు కూడా చేయాలి. ముఖ్యంగా శారీరక శ్రమ చేయడం ద్వారా మీ రక్తంలో షుగర్ స్థాయిని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఒత్తిడిలేని జీవితం, సరైన నిద్ర కూడా డయాబెటిస్ బారిన పడేస్తుంది.

Also Read : ఏవండోయ్.. చలికాలంలో మీరు తాగే టీలో ఆ ఒక్కటి వేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget